Mahesh Babu: తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ప్రసారం అవుతున్న రియాల్టీ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షోలో ఇప్పటికే ఎన్నో ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్నాయి.
మొదట మంచు ఫ్యామిలీతో సందడి చేసిన బాలయ్య.. తర్వాత న్యాచురల్ స్టార్ నానీతో సందడి చేశాడు. ఆ షోల నుంచి ఎక్కువగా వ్యూస్ వచ్చాయి. బాలయ్య హోస్ట్ గా ఇంత పాపులర్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు కూడా. దీంతో బాలయ్య అభిమానులు కూడా సంతోషంలో ఉన్నారు.
ఇక తాజాగా బాలయ్యతో సందడి చేస్తూ కనిపించాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుతో ఈ షో ఎప్పుడో పూర్తి అయినప్పటికీ.. నిర్వాహకులు ప్రసారం చేయలేదు. ఆ ఎపిసోడ్ కు ఎక్కువగా వ్యూస్ వస్తాయన్న నమ్మకంతో చాలా ఆలస్యంగా స్ట్రీమింగ్ చేశారు. నిన్నటి నుంచే ఈ ఎపిసోడ్ ప్రసారం అవుతుండగా… భారీగీ వ్యూస్ వస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను సాయంత్రం 6 తర్వాత షూటింగ్ లో పాల్గొను అంటూ చెప్పుకొచ్చాడు. సాయంత్రం 6 దాటితే నిద్ర వస్తుందని తెలిపాడు. ఇక తన సినిమాలు గౌతమ్, సితారా చూస్తారని.. బాగుంటే బాగుందని నచ్చకపోతే నచ్చలేదని చెబుతారని మహేష్ అన్నారు. తన ఫ్యామిలీతో కలిసి సినిమాలు చూడటం అంటే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన నాన్న గురించి చెబుతూ.. అతడు నటించిన అల్లూరి సీతారామరాజు సినిమా నాకు బైబిల్ అయిపోయిందని మహేష్ చెప్పుకొచ్చాడు. ఇక మహేష్ బాబు పుట్టిన రోజు ఫంక్షన్లు నిర్వహించే సమయంలో చాలామంది రూ.2 వేల నుంచి రూ. 3వేల వరకు ఇచ్చేవారని.. వాటిన తన అమమ్మ తీసుకునేవారని చెప్పాడు. తాను చేసిన అల్లరి పనులకు ఎప్పుడూ అమమ్మ కొట్టేదని చెప్పాడు. ఇక ప్రస్తుతం ఈ షో తెగ వైరల్ గా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…