Latha Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం..! ఐసీయూలో చికిత్స..!
Latha Mangeshkar: చైనా వూహాన్ లో మొదలైన కరోనా మహమ్మారి గత రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాన్ని మార్చకుంటూ ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, బీఏ2 వేరియంట్ల రూపంలో ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది.
మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లలో ఎంతోమంది మరణించారు. మన దేశంలో కూడా ఎంతో మంది ప్రముఖులు ఇటీవల కాలంలో కరోనా బారిన పడ్డారు. థర్డ్ వేవ్ ప్రారంభం అయిన తర్వాత రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా బారిన పడ్డారు.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రులు గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ తో పాటు మరికొంత మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. హిందీ, తెలుగు, తమిళ ఫిలిం ఇండస్ట్రీకు చెందిన వ్యక్తులు కూడా కరోనా బారిన పడ్దారు. ఇదిలా ఉంటే ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ కూడా ఇటీవల కరోనా సోకింది. ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
గత నెల 11న కరోనా బారిన పడ్డ లతా మంగేష్కర్ ..
అయితే ప్రస్తుతం లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. డాక్టర్ ప్రతీత్ సంధాని ఆమె ఆరోగ్యం గురించి వెల్లడించారు. ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. గత నెల 11న లతా మంగేష్కర్ కరోనాతో బాధపడుతతూ ఆసుపత్రిలో చేరారు. అయితే ఇటీవల కోలుకుంటున్న క్రమంలోనే ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…