గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్..!

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ ప్రకటించింది. పండగ సీజన్ ను పురస్కరించుకొని ఈ ఆఫర్ ను ప్రకటించింది. బంగారం రుణం తీసుకునే వారు ఏ బ్యాంకులో అయినా ప్రాసెసింగ్ ఫీజు అనేది వసూలు చేస్తుంటారు. కానీ బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో మాత్రం బంగారం, హౌసింగ్‌ లోన్స్‌ వంటి రుణాలపై విధించే ప్రాసెసింగ్‌ ఫీజులను తొలగించాలని నిర్ణయించింది.

ఇక నుంచి హౌసింగ్ లోన్ తీసుకునే సమయంలో కూడా ఎలాంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇది దసరా కంటే ముందు అంటే సెప్టెంబర్ 30 నుంచి అమలు చేస్తామని తెలిపారు. దీంతో కస్టమర్లకు ఎంతో కొంత ఉపశమనం కలగనుంది. వీటితో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ ఛార్జీలు, ప్రీపేమెంట్‌ పెనాల్టీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు ఇవ్వన్ని కూడా ఉండవని తెలిపారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకనటలో గృహ రుణంపై 6.90 శాతం వడ్డీ రేటుతో తీసుకోవచ్చు. అదే సమయంలో కారు రుణాలకు వడ్డీ రేటు 7.30 శాతంగా నిర్ణయించింది బ్యాంకు. బంగారు రుణ పథకంలో మార్పులు చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రూ.20 లక్షల వరకు బంగారు రుణాలపై వడ్డీ రేట్లు 7.10 శాతం. అదే సమయంలో రూ. లక్ష వరకు బంగారు రుణాల ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

బ్యాంకు జారీ చేసిన ప్రకటనలో గృహ రుణంపై రెగ్యులర్‌గా ఈఎంఐ చెల్లించే వారు రెండు ఈఎంఐలపై డిస్కౌంట్‌ పొందవచ్చని తెలిపారు. ఖాతాను క్లోజ్ చేసే వారు కూడా ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు.