వర్షాకాలంలో చెరుకు రసం తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలుసా?

సాధారణంగా చెరుకు రసం వేసవికాలంలో ఎక్కువగా తాగుతారు.వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల మన శరీరాన్ని చల్లబరచకోవడం కోసం,మన శరీరాన్ని డిహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటం కోసం వివిధ రకాల పండ్ల రసాలతో పాటు చెరుకు రసాన్ని కూడా తాగుతాము. అయితే శీతాకాలంలో ముఖ్యంగా వర్షాకాలంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చెరుకు రసం తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చాలామంది భావిస్తారు. నిజానికి చెరుకు రసం వర్షాకాలంలో తాగినా కూడా మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

చెరుకు రసంలో అధిక పోషక విలువలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా లభిస్తాయి. తద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందడానికి చెరుకురసం దోహదపడుతుంది.మన శరీరానికి తగినంత రోగనిరోధకశక్తి ఉండటం వల్ల వర్షాకాలంలో వచ్చేటటువంటి వివిధ రకాల అంటువ్యాధులను అరికట్టడంలో చెరుకు రసం కీలకపాత్ర పోషిస్తుంది.

అధిక శరీర బరువుతో బాధపడేవారు తరచూ చెరుకు రసం తాగడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. చెరుకులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడమేకాకుండా మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించడానికి కూడా దోహదపడుతుంది. తద్వారా శరీర బరువును తగ్గించుకోవడానికి చెరుకు రసం ఎంతగానో దోహదపడుతుంది.

చెరకులో సుక్రోజ్ శాతం అధికంగా ఉండటం వల్ల ఇది మన శరీరంలో కలిగిన గాయాలను మాన్పించటానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా ముఖం పై ఏర్పడిన మచ్చలు, మొటిమలు తగ్గించి మొహం ఎంతో కాంతివంతంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మూత్రాశయ ఇన్ఫెక్షన్ లను తగ్గించడంలో చెరుకు రసం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.