మిల్క్ బ్యూటీ గా పేరు సంపాదించుకున్న నటి తమన్నా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు. ఒకవైపు వెండితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో కూడా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ బ్యూటీ చూపు బుల్లితెర పై కూడా పడింది. తాజాగా వివిధ భాషలలో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ కార్యక్రమం కోసం తెలుగులో తమన్నాను హోస్ట్ గా ఎంపిక చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా మిల్క్ బ్యూటీ తమన్నా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి బైక్ పై తమన్నాను దించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా విజయ్ సేతుపతి ఈ కార్యక్రమం సందర్భంగా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని తను పడిన ఆకలి బాధలను తెలిపారు.అయితే తెలుగులో ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న తమన్నా ఈ కార్యక్రమానికి న్యాయం చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో అలాంటి సందేహాలకు పులిస్టాప్ పెట్టినట్లు అయింది. ఇకపోతే మాస్టర్ చెఫ్ ఈ కార్యక్రమాన్ని తమిళంలో కూడా నిర్వహించనున్నారు. అయితే తమిళంలో హీరో విజయ్ సేతుపతి ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగులో మాస్టర్ చెఫ్ కార్యక్రమం జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన అందుకు గాను తమన్నా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ సమాచారం.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక సినిమాల విషయానికొస్తే తమన్నా ఎంతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3, గోపీచంద్ సిటీ మార్, నితిన్ మాస్ట్రో వంటి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…