ఆ ఆలయ కమిటీ సంచలన నిర్ణయం.. హిందువులు కానీవారు ఆ పని చేయవద్దంటూ..!

ఆ హిందూ దేవాలయంలో దేవుడి దర్శణం కోసం వచ్చే భక్తులకు ఏదైనా వాహనం ఉంటే.. వాటిని ఆలయ సమీపంలో పార్కింగ్ చేయడానికి వీలు లేదని ఆ దేవాలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిబంధన కేవలం హిందువులు కానీ వారికి మాత్రమే అంటూ సంచలన ప్రకటన చేసింది. అది ఎక్కడ.. విషయాలు ఏంటో తెలుసుకుందాం..

కర్ణాటకలోని మంగళూరులో ఉన్న పుత్తూరు మహాలింగేశ్వర దేవాలయ కమిటీ తాజా నిర్ణయం వార్తల్లోకి ఎక్కింది. ఆలయ సమీపంలో ఓ నోటీస్ బోర్డును పెట్టారు. ఈ బోర్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో పాటు వివాదానికి కూడా దారి తీసింది. హిందువులు కానీవారు ఆలయ ఆవరణలో పార్కింగ్ చేయరాదని పుత్తూరు దేవస్థాన కమిటీ నిర్ణయించింది.

ఈ నిర్ణయం కాదని ఎవరైనా పార్కింగ్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిటీ హెచ్చరించింది. దీంతో దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కమిటీ సభ్యులు వివరణ ఇచ్చారు. ఆలయానికి సంబంధించి పార్కింగ్ స్థలం అనేది చాలా తక్కువగా ఉంది. ఆలయానికి ప్రహరీ గోడ లేదు. ఆలయానికి వచ్చే భక్తులు కాకుండా ఇతరులు కూడా ఇక్కడే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణలో అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఉండాలనే ఉద్దశ్యంతో ఇలా చేశామన్నారు.

ఒకవేళ ఎవరైనా హిందూహేతరులు పార్కింగ్ అభ్యర్థనతో వచ్చి ఫిర్యాదు చేస్తే కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆలయ సమీపంలో ఎక్కువగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో.. ఇతర ప్రదేశాలకు, బ్యాంకులకు వెళ్లే వారు ఆలయ పరిసరాల్లోనే పార్కింగ్ చేస్తున్నారు. అంతేకానీ మతాల మధ్యఅంతరాలు చూపాలనుకోవడం లేదని ఆలయ కమిటీ వివరణ ఇచ్చింది.అయితే ఈ విషయాన్ని పలువురు సామాజిక రాజకీయ నేతలు తప్పుబడుతూ.. కమిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే శకుంతల శెట్టి కోరారు.