Categories: FeaturedGeneral News

ఆ యువతి గర్భం దాల్చడానికి కారణం ఒకరైతే.. బలైంది మరొకరు.. అసలేం జరిగిందంటే.. !

ప్రతీకారం తీర్చుకోవడికోలేక చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికో తెలియదు కానీ.. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు తప్పుడు కేసులు యువకులపై పెడుతున్నారు. మొన్న సికింద్రాబాద్ లో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిగిందని.. సుచిత్ర వద్ద కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందనేవి కేవలం ఆరోపణలు అని మాత్రమే తెలిసింది. దీంతో అప్పటి వరకు కంగారు పడి.. అమాయకులను అరెస్టు చేసిన పోలీసులు అరెస్టు చేసిన వారికి జవాబు చెబుతూ వదిలేశారు.

ఇవి మరువకముందే కేరళలో మరో ఘటన చోటుచేసుకుంది. అదేంటంటే.. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన మైనర్ బాలిక.. తనని ఒక యువకుడు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడని ఆరోపించింది. వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఫిర్యాదు మేరకు పోలీసులు 18 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. అతడిని తమదైన శైలిలో విచారించారు.

కానీ అతడు తాను ఏ తప్పు చేయలేదనే వాదించాడు. అయితే అతడికి డీఎన్ఏ పితృత్వ పరీక్ష చేయగా.. అమ్మాయి గర్భం దాల్చడానికి ఈ యువకుడికి సంబంధం లేదని తేలింది. దీంతో ఆ యువకుడిని పోలీసులు వదిలేశారు. తాను మానసికంగా.. శారీరకంగా చిత్ర హింసలకు గురయ్యానని వాపోయాడు. దీంతో సదరు యువకుడు తరఫు న్యాయవాది పోలీసులపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు.

తన కొడుకుపై ఆరోపణలు చేసిన ఆ అమ్మాయి కుటుంబం తమకు సమీపంలోనే ఉంటున్నారని.. కనీసం వాళ్లు తమ వద్దకు వచ్చి క్షమాపణలు కూడా అడగలేదని ఆ యువకుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ అమ్మాయి గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిని పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago