Bollywood: మన హీరోలు బాలీవుడ్ గురించి ఏమన్నారో తెలుసా…?

Bollywood : పాన్ ఇండియా, ఈ పదం ఇపుడు బాగా వినిపిస్తోంది. ముఖ్యంగా సౌత్ సినిమాలు తీస్తున్న దర్శకులు తమ సినిమాలను పలు భాషలలో విడుదల చేసి సక్సెస్ సాధించాలనుకుంటున్నారు. చిన్నా పెద్ద లేకుండా సినిమాలను పలు భాషలలో విడుదల చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక చాలా మంది కుర్ర దర్శకులకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్నాయి.

ఇంతకీ బాలీవుడ్ గురించి మన హీరోల అభిప్రాయాలేంటి…..

ఇక మన స్టార్ హీరోలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్నారు. కేజీఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలతో సౌత్ సినిమాలు నార్త్ లో దుమ్ము లేపుతున్నాయి. ఇక ఆర్జీవి వంటి వారు బాలీవుడ్ సినిమాలను ఓటిటి లో విడుదల చేసుకుంటే మంచిది ఎలాగూ సౌత్ సినిమాలు థియేటర్లలో ఉంటాయి కాబట్టి అంటూ వ్యంగ్యస్త్రాలు కూడా సంధించారు. ఇక మన హీరోలు బాలీవుడ్ అవకాశాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. అందరిలోకి మహేష్ బాబు చేసినా కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరిచాయి. బాలీవుడ్ నుండి అవకాశాలు వస్తున్నాయి కానీ బాలీవుడ్ నన్ను భరించలేదు అంటూ ఆయన కామెంట్ చేసారు. ఇక అల్లుఅర్జున్ కూడా బాలీవుడ్ నుండి ఆఫర్స్ వస్తున్న కూడా కథలు నచ్చడం లేదని ఇతర భాషలలో నటించాలంటే ధైర్యం ఉండాలని విలన్ పాత్రలపై తనకు ఆసక్తి లేదంటూ చెప్పారు.

ఇక కేజీఎఫ్ సంచలనం యష్ బాలీవుడ్ గురించి తనదైన శైలిలో మాట్లాడారు. బాలీవుడ్ ప్రేక్షకులు సౌత్ డబ్బింగ్ సినిమాలను చాలా కాలంగా టీవీలో బాగా ఆదరిస్తున్నారు సౌత్ నేటివిటీ కథలు వాళ్లకు బాగా నచ్చుతున్నాయి అని అన్నారు. ఇక రామ్ చరణ్ మాట్లాడుతూ హిందీ డైరెక్టర్స్ తో పనిచేయాలని ఉందని కానీ సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునే కథలను బాలీవుడ్ దర్శకులు ప్లాన్ చేయాలని చెప్పారు. ఇక ప్రభాస్ ఆసక్తికరంగా మాట్లాడారు. ఏ భాష సినిమా ఎపుడు పాన్ ఇండియా సినిమాగా మారుతుందో తెలియదని ప్రేక్షకులకు భాష కన్నా సినిమా కంటెంట్ ముఖ్యమని చెప్పారు. భవిష్యత్తులో అన్ని భాషల సినిమాలు పాన్ ఇండియా సినిమాలు అవుతాయని ఆయన చెప్పారు.