Mythri Movie Makers: సాధారణంగా ప్రతి శుక్రవారం థియేటర్ వద్ద సినిమా తలరాతలే మారిపోతాయి. ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు విడుదలయి సినిమా తలరాతనే మారుస్తూ ఉంటాయి. కొన్ని సినిమాలు విడుదలైన మొదటి రోజే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అనంతరం సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపుతూ డీలా పడిపోతుంటాయి.మరికొన్ని సినిమాలు మొదటి రెండు రోజులు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ ఆ తర్వాత బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకునే సినిమాలు కూడా ఉన్నాయి.
ఇలాంటి సినిమాల విషయానికొస్తే గతంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా మంచి ఉదాహరణ. ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అనంతరం ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకర్షించి బ్లాక్ బస్టర్ విజయం అయింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ చిత్రం కోసం ప్రతి ఒక్క అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ టాక్ సంపాదించుకున్నా ప్రస్తుతం కలెక్షన్ల పరంగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్లను రాబట్టడం వెనక మైత్రి మూవీ మేకర్స్ కృషి ఎంతో ఉంది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంటే వెంటనే రంగంలోకి దిగి పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటారు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి అనంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తారు. ఈ విధంగా ప్లాప్ టాక్ సొంతం చేసుకున్న పుష్ప, సర్కారు వారి పాట వంటి చిత్రాలను కూడా బ్లాక్ బస్టర్ చేసిన ఘనత మైత్రి మూవీ మేకర్స్ ఉందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…