Categories: FeaturedMovie News

Super star Krishna : సర్కారు వారి పాట సినిమా పై ఆ ఛానెల్ పనిగట్టుకుని నెగెటివ్ ప్రచారం చేసింది.. : కృష్ణ

Super star Krishna : మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదలయిన రోజు నుండి మంచి టాక్ తో దూసుకుపోతుంది. సినిమాపై మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినా ఆ తరువాత మాత్రం సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. మహేష్ బాబు కీర్తీ సురేష్ జంటగా నటించిన ఈ సినిమాను పరుశురామ్ దర్శకత్వం వహించాడు. ఇక సినిమాలో థమన్ మ్యూజిక్ అలరించింది. సముద్రఖని యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

ఇక సినిమా గురించి మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ స్పందించారు. ఒక యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాగా వర్ణించారు. సినిమా చూసాక మంచి సినిమా చూశామనే అనుభూతి ప్రేక్షకులకు కలుగుతుందని అన్నారు. ఇక ఒక ఛానల్ పనిగట్టుకుని సినిమాపై చెడు ప్రచారం చేసిందని చెప్పారు. ఇక కృష్ణ చెప్పింది మొన్నా మధ్య మహేష్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేసిన టీవీ 9 ఛానల్ గురించేనేమో అని అందరూ అనుకుంటున్నారు.

ఇక విజయోత్సవాన్ని కర్నూల్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు చిత్రబృందం. ఇక ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా మహేష్ నిలిచారు. సాధారణంగా వేదికపై ఎక్కువగా మాట్లాడటానికి కానీ ఇష్టపడని మహేష్ స్వచ్చందంగా వేదికపై డాన్సర్లు, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తో కలిసి స్టెప్పులేసారు. మహేష్ ఇలా ఎంత జోష్ తో స్టెప్పులేయడం మొదటిసారి. ఇక అభిమానులు ఈ స్టెప్పులకు ఫుల్ రచ్చ చేస్తున్నారు

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago