Featured

Aacharya film producer : తెలంగాణ వ్యక్తికి ఏపీ లో రాజ్యసభ సీటు… ఏపీ సీఎం వ్యక్తిగత న్యాయవాదికి బంపర్ ఆఫర్..!

Aacharya film producer : ఏపీ సీఎం జగన్ రాజ్యసభ ఎంపీలుగా ఎవరిని ఎంపిక చేస్తారు అన్న విషయానికి తెరదించుతూ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ లతో సుదీర్ఘ భేటీ తరువాత నలుగురు అభ్యర్థులను ఫైనల్ చేశారు. ఆల్రెడీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డిని మళ్ళీ రాజ్యసభ మెంబెర్ గా కొనసాగిస్తూ, మిగిలిన మూడు స్థానాలకు గాను ఇద్దరు బీసీ, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇచ్చారు. విజయసాయి రెడ్డి తో పాటు, ఆర్ కృష్ణయ్య, టీడీపీ నుండి వైసీపీ లోకి వచ్చిన బీద మస్తాన్ రావు ఇక ప్రొడ్యూసర్ మరియు న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డిలకు అవకాశం ఇచ్చారు.

ఆచార్య ప్రొడ్యూసర్ కు రాజ్యసభ సీటు….

ఇక ఇపుడు అందరి చూపులు నిరంజన్ రెడ్డి వైపే. జగన్ రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు తెలియగానే అందరి దృష్టి ఆచార్య ప్రొడ్యూసర్ పైనే ఉంది. నిరంజన్ రెడ్డి ది తెలంగాణ, నిర్మల్ ప్రాంతం. నిరంజన్ ఏపీ సీఎం జగన్ కు సిబిఐ కేసులు వాదించే వ్యక్తిగత న్యాయవాది. ఇక ఈయన సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆచార్య లాంటి భారీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిరంజన్ అంతకుముందు కూడా క్షణం, ఘజీ, వైల్డ్ డాగ్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలను ప్రొడ్యూసర్ చేసారు. 2011 నుండి జగన్ అక్రమ ఆస్తుల కేసులో లాయర్ గా వ్యవహరిస్తున్నారు.

1970 జూలై 22 వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నిరంజన్ తన న్యాయవాద విద్యను పూణేలోని సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల కోర్సు చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ న్యాయవాదులైన మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిల వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2016లో అప్పటి ఏపీ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా హోదాను కల్పించింది. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే సినిమాలపై మక్కువతో నిర్మాతగా మారారు. ఇక ఈయన స్థానంలో తొలుత కమెడియన్ అలీకి రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్న నిరంజన్ రెడ్డికి సీటు దక్కింది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago