రోగ నిరోధక శక్తి పెరగాలా? అయితే ఈ హెర్బల్ టీ తాగాల్సిందే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు వారి శరీరంలో రోగ నిరోధక శక్తిని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.రోగ నిరోధక శక్తిని పెంచడం వల్ల మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్స్ అధిక స్థాయిలో ఉండడంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ఎటువంటి ప్రమాదం లేకుండా ఈ మహమ్మారి నుంచి బయట పడవచ్చు.అదేవిధంగా పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం వల్ల ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండవచ్చు.

కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు వారి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకొని భాటలో పడ్డారు. అయితే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం హెర్బల్ టీలు ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ నేపథ్యంలో వెల్‌నెస్ కోచ్ ల్యూక్ కౌటిన్హో సూచించిన కొన్ని హెర్బల్ టీల గురించి తెలుసుకుందాం…

ఒక గిన్నెలో రెండు లీటర్ల నీటిని తీసుకొని బాగా మరిగించాలి. మరుగుతున్న నీటిలో దాల్చిన చెక్క 1, వెల్లుల్లిపాయలు 3, ఒక టేబుల్ స్పూను మెంతులు, ఐదు తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి.5నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా ఉన్న ఆ నీటిని వడ పోసుకోవాలి ఈ నీటిని ప్రతి రోజు 250 మిల్లీలీటర్ చొప్పున త్రాగటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.

ఈ రెండు లీటర్ల గోరువెచ్చని దాల్చిన చెక్క కషాయం చల్లారిన తరువాత ఒక బాటిల్ లో నిల్వ చేసుకుని రెండు రోజులపాటు తాగవచ్చు. ఈ దాల్చిన చెక్క టీ లో ఉపయోగించిన పదార్థాలు అధికభాగం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి.ఈ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో వ్యాపించే వైరస్లతో పోరాడి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ సమ్మేళనాలతో కలిపి తయారుచేసిన హెర్బల్ టీ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను, మన శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు.