Brahmanandam : నెల్లూరు పెద్దారెడ్డి రిలేషన్ అంటూ అప్పట్లో సెన్సేషన్.. బ్రహ్మానందం నటనకు ఏకంగా నంది పురస్కారం వరించింది.!!

రాంగోపాల్ వర్మ అనగానే టక్కున గుర్తు వచ్చే సినిమా శివ. ఈ సినిమా నిర్మాణం కంటే ముందు.. నాగార్జున ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని రాంగోపాల్ వర్మ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాగే తాను చూసిన కొన్ని చిత్రాల్లోని దృశ్యాలను తీసుకొని శివ సినిమా కథ రాయడం జరిగింది. అలా ఆ కథ చెప్పి తనికెళ్ళ భరణిని స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారు. అంతకుముందు కామెడీ చిత్రాలకు రచయితగా పనిచేసిన భరణి. శివ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కు హాస్యాన్ని జోడించి రాయడం జరిగింది.

Brahmanandam : నెల్లూరు పెద్దారెడ్డి రిలేషన్ అంటూ అప్పట్లో సెన్సేషన్.. బ్రహ్మానందం నటనకు ఏకంగా నంది పురస్కారం వరించింది.!!

అది చూసి నవ్వుకున్న వర్మ ఈ సినిమాలో కామెడీ లేదు. అలాంటి సంభాషణలు, దృశ్యాలు కూడా ఉండవని చెప్పడంతో తనికెళ్ల భరణి తెల్లమొహం వేశారు. అలా కామెడీ లేకుండానే శివ సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన క్షణక్షణం, రాత్రి, అంతం, గాయం లాంటి సినిమాలు కూడా హాస్యానికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన మనీ, అనుకోకుండా ఒక రోజు చిత్రాలలో హాస్యానికి పెద్ద పీట వేస్తూ బ్రహ్మానందంతో కామెడీ చేయించారు.

“అనగనగా ఒక రోజు” రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె.డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా నటించగా 1996 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా నటించగా 1996 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా. చక్రి (జె. డి. చక్రవర్తి), మధు (ఊర్మిళ) పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు.వీరి ప్రేమను అంగీకరించరు. వారిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు.

మధ్యలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. మధ్యలో ఒక కారు ఆపి ఎక్కుతారు. కారు డ్రైవరు మధ్యలోనే చనిపోతాడు.వీళ్ళు హత్య కేసులో ఇరుక్కుంటారు. ఓ పక్క పోలీసులు,ఓ పక్క రౌడీలు వీరిని తరుముకుంటూ వస్తుంటారు. వీటన్నింటినీ అధిగమించి చివరకు బ్రహ్మానందం(420) కంటపడతారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం కారులో వస్తుండగా పోలీసులు వలవేసి పట్టుకుంటారు. పోలిస్ ఎవరు నువ్వని బ్రహ్మానందం ను ప్రశ్నించగా.. మైకేల్ జాక్సన్, నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుడిని…వాడెవడని పోలీస్ అనగానే దానికి బ్రహ్మానందం బదులిస్తూ.. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? ఆయన పేరు తెలియకుండానే మీరు డిపార్ట్మెంట్ లో జాబులు చేస్తున్నారా? అని ఆశ్చర్యంగా చూస్తాడు.

కట్ చేస్తే బ్రహ్మానందం పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దా రెడ్డి.. అంటూ ల్యాండ్ ఫోన్ తీయగానే అక్కడే ఉన్న పోలీస్ 420గా నమోదయిన ఫైల్ తెరవగానే బ్రహ్మానందం ఫోటో కనిపిస్తుంది. బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్, సైలెంట్ కామెడీ ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మానందం ఇదివరకు చేసిన కామెడీ వేరు ఈ సినిమా వేరు.

మరొక సందర్భంలో బ్రహ్మానందం, రఘువరన్ తలకి గన్ పెట్టి ఇది పెన్ అనుకున్నావా? కాదు గన్ అంటాడు. సినిమా మొత్తం సీరియస్ నెస్, కన్ స్ట్రక్టివ్ వేలో బ్రహ్మానందం కామెడీ ఉంటుంది. ఒక ప్రత్యేక డైలాగ్ డిక్షన్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమాలో చేసిన బ్రహ్మానందం కామెడీకి ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ హాస్యనటుడు పురస్కారాన్ని అందుకున్నారు.