రాంగోపాల్ వర్మ అనగానే టక్కున గుర్తు వచ్చే సినిమా శివ. ఈ సినిమా నిర్మాణం కంటే ముందు.. నాగార్జున ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని రాంగోపాల్ వర్మ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అలాగే తాను చూసిన కొన్ని చిత్రాల్లోని దృశ్యాలను తీసుకొని శివ సినిమా కథ రాయడం జరిగింది. అలా ఆ కథ చెప్పి తనికెళ్ళ భరణిని స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నారు. అంతకుముందు కామెడీ చిత్రాలకు రచయితగా పనిచేసిన భరణి. శివ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కు హాస్యాన్ని జోడించి రాయడం జరిగింది.
అది చూసి నవ్వుకున్న వర్మ ఈ సినిమాలో కామెడీ లేదు. అలాంటి సంభాషణలు, దృశ్యాలు కూడా ఉండవని చెప్పడంతో తనికెళ్ల భరణి తెల్లమొహం వేశారు. అలా కామెడీ లేకుండానే శివ సినిమా తీసి హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన క్షణక్షణం, రాత్రి, అంతం, గాయం లాంటి సినిమాలు కూడా హాస్యానికి అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చిన మనీ, అనుకోకుండా ఒక రోజు చిత్రాలలో హాస్యానికి పెద్ద పీట వేస్తూ బ్రహ్మానందంతో కామెడీ చేయించారు.
“అనగనగా ఒక రోజు” రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె.డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా నటించగా 1996 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో జె. డి. చక్రవర్తి, ఊర్మిళ ప్రధాన పాత్రధారులుగా నటించగా 1996 లో విడుదలైన ఒక ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా. చక్రి (జె. డి. చక్రవర్తి), మధు (ఊర్మిళ) పక్కపక్క ఇళ్ళలో ఉంటారు. ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్ళి చేసుకోవాలనుకుంటారు. కానీ వారి తల్లిదండ్రులు చిన్న చిన్న విషయాలకు కూడా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు.వీరి ప్రేమను అంగీకరించరు. వారిద్దరూ ఇంట్లోంచి పారిపోతారు.
మధ్యలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. మధ్యలో ఒక కారు ఆపి ఎక్కుతారు. కారు డ్రైవరు మధ్యలోనే చనిపోతాడు.వీళ్ళు హత్య కేసులో ఇరుక్కుంటారు. ఓ పక్క పోలీసులు,ఓ పక్క రౌడీలు వీరిని తరుముకుంటూ వస్తుంటారు. వీటన్నింటినీ అధిగమించి చివరకు బ్రహ్మానందం(420) కంటపడతారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం కారులో వస్తుండగా పోలీసులు వలవేసి పట్టుకుంటారు. పోలిస్ ఎవరు నువ్వని బ్రహ్మానందం ను ప్రశ్నించగా.. మైకేల్ జాక్సన్, నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుడిని…వాడెవడని పోలీస్ అనగానే దానికి బ్రహ్మానందం బదులిస్తూ.. నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? ఆయన పేరు తెలియకుండానే మీరు డిపార్ట్మెంట్ లో జాబులు చేస్తున్నారా? అని ఆశ్చర్యంగా చూస్తాడు.
కట్ చేస్తే బ్రహ్మానందం పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దా రెడ్డి.. అంటూ ల్యాండ్ ఫోన్ తీయగానే అక్కడే ఉన్న పోలీస్ 420గా నమోదయిన ఫైల్ తెరవగానే బ్రహ్మానందం ఫోటో కనిపిస్తుంది. బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్, సైలెంట్ కామెడీ ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మానందం ఇదివరకు చేసిన కామెడీ వేరు ఈ సినిమా వేరు.
మరొక సందర్భంలో బ్రహ్మానందం, రఘువరన్ తలకి గన్ పెట్టి ఇది పెన్ అనుకున్నావా? కాదు గన్ అంటాడు. సినిమా మొత్తం సీరియస్ నెస్, కన్ స్ట్రక్టివ్ వేలో బ్రహ్మానందం కామెడీ ఉంటుంది. ఒక ప్రత్యేక డైలాగ్ డిక్షన్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమాలో చేసిన బ్రహ్మానందం కామెడీకి ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ హాస్యనటుడు పురస్కారాన్ని అందుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…