Sarkaru Vaari Paata: పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా మే 12వ తేదీ విడుదల అయ్యింది. మొదటి షో తోనే మిశ్రమ స్పందన లభించిన కలెక్షన్ల పరంగా భారీ వసూళ్లను రాబడుతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది అంటూ మేకర్స్ కూడా వెల్లడించారు.
ఈ క్రమంలోనే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ 100కోట్ల పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ పోస్టర్ పై స్పందిస్తూ మిశ్రమ స్పందన లభించిన ఈ సినిమా వంద కోట్లు రాబట్టడం ఎంత వరకు నిజం? ఈ పోస్టర్ లో నిజం ఎంత ఉంది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ఓవర్సీస్ లో $2 మిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఓవర్సీస్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా పలుచోట్ల కలెక్షన్లు మంచిగానే ఉన్నప్పటికీ ఏకంగా వంద కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు ఈ పోస్టర్ పై స్పందిస్తూ ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ ఉన్న పోస్టర్లను విడుదల చేస్తూ మహేష్ బాబు ఇమేజ్ ని డ్యామేజ్ చేయకండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు సినిమా యావరేజ్ టాక్ వచ్చినా జనాలు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారు. సర్కారు వారి పాట విషయంలో కూడా అదే జరిగింది. కానీ ఒకే సారి ఇలా 100 కోట్ల పోస్టర్ విడుదల చేయడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…