Karate Kalyani: కరాటే కళ్యాణి యూట్యూబ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డితో పెట్టుకున్న గొడవ చినికి చినికి గాలి వానలా తయారైంది. ఫ్రాంక్ వీడియోలు అంటూ ఈ వివాదం మొదలై చివరికి చిన్నారి దత్తత వరకు దారి తీసింది.ఈ క్రమంలోనే తనతోపాటు ఉన్న చిన్నారి ఎవరు ఏంటి అని అధికారులు ఆరా తీస్తున్నారు.ఈ విధంగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు తన ఇంటిని సోదా చేస్తున్న సమయంలో కరాటే కళ్యాణి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే అనంతరం మీడియా ఎదుటకు వచ్చిన ఈమె తన లాయర్ తో మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఐదు నెలల చిన్నారిని దత్తత తీసుకున్నాననే విషయంలో ఏ మాత్రం నిజం లేదు కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా నాపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.అయితే గతంలో కరాటే కళ్యాణి ఈ చిన్నారిని దత్తత తీసుకున్నట్లు యూట్యూబ్ ఛానల్స్ లో వెల్లడించారు. ఈ విషయం గురించి కరాటే కళ్యాణి మీడియా సమావేశంలో మాట్లాడారు.
గతంలో తాను యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ చిన్నారిని దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన మాట వాస్తవమే.అలా చెప్పడం వల్ల నన్ను చూసి మరికొందరు ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి చిన్నారులను దత్తత తీసుకుంటారనే ఉద్దేశంతోనే అలా చెప్పానని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అయితే నేను ఈ చిన్నారిని దత్తత తీసుకో లేదు నాకు కలెక్టర్ల నుంచి కానీ, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల నుంచి కాని ఏ విధమైనటువంటి నోటీసులు రాలేదని ఆమె తెలియజేశారు.
ఈ విషయం గురించి కలెక్టర్ ను సంప్రదించి వివరణ ఇచ్చాను. ఇక చిన్నారి తన తల్లిదండ్రులతో పాటు నా దగ్గరే ఉంటుందని, కావాలనే శివశక్తి సమస్థ వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే లాయర్ మాట్లాడుతూ ఈమె దత్తత తీసుకోనపుడు ఇది లీగలా,ఇల్లీగలా అన్న ప్రశ్న ఎక్కడిది. పాపను దత్తత తీసుకోలేదు. కలెక్టర్‌కి ఇదే విషయం వివరించాము. కలెక్టర్ కూడా ఇదే ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు వెల్లడించారు. ఇంతటితో ఈ సమస్యకు పులిస్టాప్ పడిందని లాయర్ వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…