చూయింగ్ గమ్ తో బరువు తగ్గవచ్చా.. నిపుణులు ఏమంటున్నారంటే..!

మనం క్రికెట్ ఆడే ఆటగాళ్లను చూస్తున్నప్పుడు.. ఒకానొక సమయంలో వాళ్లు నోట్లో ఏదో నములుతున్నట్లు కనిపిస్తుంటుంది కాదా.. అదే చూయింగ్ గమ్. దీనిని సాధారణంగా ఒత్తిడి నుంచి బయటపడటానికి ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల మరో ఉపయోగం కూడా ఉందని తేలింది. అదేంటంటే.. దీనిని తీసుకోవడంలో ఆకలి వేయదు.

దీంతో బరువు తగ్గే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకున్న తర్వాత బయట దొరికే జంక్ ఫుడ్ ను తినాలని అనిపించదు. దీంతో వాటికి దూరంగా ఉంటారు. కావునా బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చని వైద నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఓ చోట కూర్చుని చూయింగ్ గమ్ తింటున్న వారితో పోల్చితే వాకింగ్ చేస్తూ చూయింగ్ గమ్ నమిలే వారిలో బరువు తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ సమస్యలు కూడా దూరం అవుతాయట. అంతే కాకుండా మన ముఖంపై ఉండే కండరాలకు కూడా ఎక్సర్‌సైజ్ అవుతాయి. అయితే దీని వల్ల అప్పటికే మన శరీరంలో ఉండే కేలరీలు ఖర్చు కావు.. కానీ మున్ముందు పెరిగే ఉభకాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు. చూయింగ్ గమ్ తీసుకోవడం వల్ల ఒక సమస్య ఉంది.

అదేంటంటే.. పంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఎక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది.. కాబట్టి పళ్లకు హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. షుగర్ లేని చూయింగ్ గమ్ అయితే మంచిదని డెంటిస్ట్ లు సలహా ఇస్తున్నారు.