ప్రతీ రోజు ఏదో ఒక ప్రదేశంలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాల వార్తలు వింటూనే ఉన్నాం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వాళ్లు మాత్రం మారడం లేదు. అదే కోవలో వెళ్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనలో.. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇది రాజస్థాన్ లో జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ రాష్ట్రం నాగపూర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇది గమనించిన పక్కింటి వ్యక్తి హరిప్రసాద్ ఏదో పని ఉందని.. ఇంటికి పిలిచాడు. తెలిసిన వాడే కదా అని ఆమె వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడకు వెళ్లిన ఆ బాలికకు అతడితో పాటు .. మరో నలుగురు వ్యక్తులు కూడా కనిపించారు. ఆమె ఇంట్లోకి రాగానే తలుపు వేశాడు హరిప్రసాద్.
ఆమె కేకలు వేయడంతో నోరు మూశారు. తర్వాత ఐదుగురు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు.. తర్వాత ఆ బాలికను ఇంటికి పంపించారు. ఆమె ప్రవర్తనలో ఆ రోజు నుంచి మార్పు వచ్చింది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆ బాలికపై అనుమానం వచ్చింది.
ఆ బాలికను తల్లిదండ్రులు గట్టిగా నిలదీయగా.. జరిగిన విషయం చెప్పింది. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ఐదుగురిలో ఒకరు మైనర్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…