మనం క్రికెట్ ఆడే ఆటగాళ్లను చూస్తున్నప్పుడు.. ఒకానొక సమయంలో వాళ్లు నోట్లో ఏదో నములుతున్నట్లు కనిపిస్తుంటుంది కాదా.. అదే చూయింగ్ గమ్. దీనిని సాధారణంగా ఒత్తిడి నుంచి బయటపడటానికి ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల మరో ఉపయోగం కూడా ఉందని తేలింది. అదేంటంటే.. దీనిని తీసుకోవడంలో ఆకలి వేయదు.
దీంతో బరువు తగ్గే అవకాశం ఉందంటూ నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకున్న తర్వాత బయట దొరికే జంక్ ఫుడ్ ను తినాలని అనిపించదు. దీంతో వాటికి దూరంగా ఉంటారు. కావునా బరువు పెరగకుండా నియంత్రించుకోవచ్చని వైద నిపుణులు చెబుతున్నారు. మామూలుగా ఓ చోట కూర్చుని చూయింగ్ గమ్ తింటున్న వారితో పోల్చితే వాకింగ్ చేస్తూ చూయింగ్ గమ్ నమిలే వారిలో బరువు తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ సమస్యలు కూడా దూరం అవుతాయట. అంతే కాకుండా మన ముఖంపై ఉండే కండరాలకు కూడా ఎక్సర్‌సైజ్ అవుతాయి. అయితే దీని వల్ల అప్పటికే మన శరీరంలో ఉండే కేలరీలు ఖర్చు కావు.. కానీ మున్ముందు పెరిగే ఉభకాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటున్నారు. చూయింగ్ గమ్ తీసుకోవడం వల్ల ఒక సమస్య ఉంది.
అదేంటంటే.. పంటికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఎక్కువ మోతాదులో చక్కెర ఉంటుంది.. కాబట్టి పళ్లకు హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. షుగర్ లేని చూయింగ్ గమ్ అయితే మంచిదని డెంటిస్ట్ లు సలహా ఇస్తున్నారు.
ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…