కొన్ని సంఘటనలు తెలిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. చెత్త వేరుకునే వ్యక్తి.. భిక్షాటన చేసే వ్యక్తి కోటీశ్వరులు అయ్యారని వింటూ ఉంటాం. అవి మనం నమ్మడానికి అంత స్కోప్ లేకున్నా.. నిజం కాబట్టి నమ్మి తీరాల్సిందే. అలాంటిదే ఓ ఘటన నమ్మశక్యం కాకుండా ఉంది.
అది ఏంటంటే.. టెక్సాస్‌లోని డల్లాస్‌లో ఉంటున్న 32 ఏళ్ల టిప్పానీ.. ఓ కేఫ్ లో ఫుల్ టైం జాబ్ చేస్తూ ఉంది. అక్కడ వచ్చే జీతం సరిపోకనో.. లేదా మరేదైనా కారణం వల్లనో ఏమో కానీ.. ఆమె జాబ్ కు రిజైన్ చేసింది. తర్వాత ఆమె చెత్త ఏరడం మొదలు పెట్టింది. చెత్త అంటే తిని పారేసిన విస్తారాకులు, గ్లాస్ లు కాకుండా.. రీ-సైక్లింగ్ చేయగలిగేవి.. కొద్దిగా వాడి పారేసిన చాలా వస్తువులను మాత్రమే సేకరించింది.
ఎలక్ట్రానిక్ వస్తువులు, వీడియో గేమ్‌లు, కలర్స్ స్కెచ్చెస్, డెలివరీ అట్టపెట్టెలు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, వాటర్ బాటిల్స్, మేకప్ ఐటెమ్స్ వంటి వాటిని సేకరించి విక్రయించడం కూడా మొదలు పెట్టింది. అలా ఆమె వాటిని తక్కువ ధరకు అమ్ముతూ మొదటి నెల రూ. 88 వేలు సంపాదించింది.
ఇలా ఆమె గత ఐదు సంత్సరాలుగా ఇలానే విక్రయిస్తూ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తూ.. రూ. కోట్లల్లో కూడబెట్టింది. మొదట్లో భర్త ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తర్వాత ఆమె చేసే పని చూసి గర్వంగా ఫీలయ్యాడు. తర్వాత ఆమె టిక్ టాక్ లో అకౌంట్ తెరిచి తాను ఏం పని చేస్తుందో అంతా వివరంగా చెప్పడం మొదలు పెట్టింది. దీంతో ఆమె టిక్ టాక్ పాలోయింగ్ కూడా ఎక్కువ అయింది. దీనిని చూసి ఆమె చేస్తున్న పనికి ప్రతీ ఒక్కరు ప్రశంసిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…