Casino Fraud : ఆన్లైన్ గేమ్ ఆడి 95లక్షలు పోగొట్టుకున్న తెలంగాణ యువకుడు…!

Casino Fraud : మొబైల్ ఫోన్, సోషల్ మీడియా జమానాలో ఎటు నుండి ఎవరు మోసం చేస్తారో తెలియని వైనం. తెలియని ఆప్స్ ను ఫోన్ లో పెట్టుకోకండి అంటూ పోలీసులు చెబుతూనే ఉన్నా ఎన్నో సైబర్ మోసాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా, బ్యాంకుల పేరుతో, గేమ్స్ పేరుతో ఇప్పటికీ మోసాలు జరుగుతూనే ఉన్నాయి, వాటికి ఎంతో మంది బలవ్వుతూ ఉన్నారు. ఒకవైపు ఆన్లైన్ గేమ్స్ లో డబ్బులు పోగొట్టుకుంటుంటే మరో వైపు వ్యక్తిగత డేటా చోరీ చేయబడుతోంది. ఇంకా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటేనే ఇలాంటి మోసాలను అరికట్టవచ్చు.

95 లక్షలు పోగొట్టుకున్న హర్ష వర్ధన్ రెడ్డి…

తెలంగాణ రాష్ట్రానికి చెందిన షాబాద్ మండలం, సీతారాంపూర్ గ్రామ వాసి అయిన హర్షవర్ధన్ రెడ్డి ది వ్యవసాయిక కుటుంబం. స్మార్ట్ ఫోన్ లో క్యాసినో గేమ్ ఆడి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 95 లక్షలు పోగొట్టుకున్నాడు. అంతా అయ్యాక తేరుకున్న బాబు పోలీసులను ఆశ్రయించాడు. హర్షవర్ధన్ రెడ్డి ఏదో ఫోన్లో చూస్తున్నపుడు 567 ఆన్లైన్ గేమ్ ఆప్ కి సంబంధించిన పేజీ ఓపెన్ అయి అందులోకి వెళ్ళాడు. ఇక గేమ్ ఆడితే డబ్బులు వస్తాయి అన్న ఉదేశంతో మొదట సరదాగా 2000 అలా డిపాజిట్ చేసి గేమ్ ఆడిన హర్షవర్ధన్ అందులో మొదట్లో 50 వేలు పోగొట్టుకున్నాడు.

వాటిని ఎలా అయినా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఆడి 12 లక్షలు పోగొట్టుకున్నాడు. ఇంకా తేరుకోని హర్షవర్ధన్ రెడ్డి అకౌంట్ లో డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్న క్యాష్ ను తన తల్లి అకౌంట్ లోకి ట్రాన్సఫర్ చేసి మళ్ళీ గేమ్ ఆడి చివరకు 95 లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బంతా పోయాక గానీ తేరుకోని హర్షవర్ధన్ 567 ఆన్లైన్ గేమ్ కంపెనీ మీద చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించగా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని 567 ఆన్లైన్ కంపెనీ కి వివరణ ఇవ్వాలాంటూ లేఖ రాసారు. ప్రస్తుతం 567 ఆన్లైన్ కంపెనీ నుండి రిప్లై కోసం ఎదురుచూస్తున్నారు.