Prabhas -Nayantara: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబెల్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.ఇలా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంది ఆదరణ సంపాదించుకున్నటువంటి ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ప్రభాస్ గురించి లేడీస్ సూపర్ స్టార్ నయనతార షాకింగ్ కామెంట్స్ చేశారు.
నయనతార నటించిన కనెక్ట్ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో మొదటిసారి ఈమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరయ్యారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నయనతార యాంకర్ సుమతో కలిసి ఎన్నో వృత్తిపరమైన వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటించారు. ఇక ఈమె తెలుగులో చాలామంది హీరోల సరసన నటించిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ప్రభాస్ తో కలిసి మున్నా సినిమాలో నటించారు నయనతార. ఈ క్రమంలోనే యాంకర్ సుమ నయనతారను ప్రశ్నిస్తూ ప్రభాస్ తో నటించడం ఎలా అనిపించిందని ప్రశ్నించగా ప్రభాస్ గురించి నయనతార చెబుతూ ప్రభాస్ చాలా చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారు.తనతో కలిసి సినిమా చేసే సమయంలో సెట్ లో ఎంతో సరదాగా జోకులు వేస్తూ ఉండేవారు.
ప్రభాస్ సెట్ లోకి వచ్చారంటే ఒక చోట స్థిమితంగా ఉండరు. దూకడం, ఎగరడం, గంతులు వేస్తూ ఉంటారు. ఈయన సెట్ లో ఉంటే సెట్ మొత్తం అల్లరి అల్లరిగా ఉంటుంది. అందుకే ప్రభాస్ తో షూటింగ్లో ఉండడం చాలా సరదాగా ఉంటుందని ఈమె తెలిపారు.ఇక ప్రస్తుతం ప్రభాస్ స్టార్ హీరో అయ్యారు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిగ్ స్టార్ అయ్యారు. ప్రస్తుతం తను ఎలా ఉంటారనే విషయం తనకు తెలియదని ప్రభాస్ గురించి నయనతార చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…