Singer Sunitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సునీత గురించి పరిచయం అవసరం లేదు. ఈమె తన అద్భుతమైన గాత్రంతో కొన్ని వందల పాటలను ఆలపించడమే కాకుండా ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సునీత వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించారు.
19 సంవత్సరాల వయసులోనే సునీత పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత తన భర్తతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా పిల్లలతో జీవితంలో ప్రయాణం చేశారు.ఇలా ఒంటరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కొన్న సునీత 2021 వ సంవత్సరంలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని రెండవ వివాహం చేసుకున్నారు.
ఇలా తనని వివాహం చేసుకున్న తర్వాత సునీత తన కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా రామ్ వీరపనేని ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ అసలు పేరు రామకృష్ణ వీరపునేని ఈయన ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకొని ఇక్కడ వ్యాపారాలలో స్థిరపడ్డారు. ఇక ఈయన మ్యాంగో మీడియాకి సీఈవోగా వ్యవహరిస్తూ యూట్యూబ్ ఛానల్ ను కూడా రన్ చేస్తున్నారు.
తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమిళం హిందీ ఇంగ్లీష్ సినిమాలను డబ్ చేస్తూ యూట్యూబ్ ద్వారా విడుదల చేస్తూ భారీగా లాభాలను అందుకుంటున్నారు. అదేవిధంగా ఈయన పలు ప్రముఖ కంపెనీలలో వందల కోట్ల షేర్స్ కూడా పెట్టారని సమాచారం. ఇవే కాకుండా హైదరాబాదులో పలు ప్రాంతాలలో ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నాయని తెలుస్తుంది.తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తి కొన్ని కోట్లలో ఉండగా ఈయన సంపాదించినది కూడా కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్నట్లు సమాచారం. రెండు తరాల వారు కూర్చుని తిన్న తరగని ఆస్తిని రామ్ సంపాదించినట్టు తెలుస్తుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…