Movie News

Anchor Anasuya: యాంకర్ అనసూయ భర్త గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Anchor Anasuya: బుల్లితెర జబర్దస్త్ యాంకర్ గా, వెండితెర రంగమ్మత్తగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ గురించి అందరికీ సుపరిచితమే. న్యూస్ రిప్రజెంటేటర్ గా పని చేస్తున్నటువంటి ఈమె అనంతరం సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించారు. అయితే ఏవి గుర్తింపు తీసుకురాలేదని చెప్పాలి.జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించిన అనసూయకు ఈ కార్యక్రమం ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి అనసూయ ఎంతో పాపులారిటీని సొంతం చేసుకుని వెండితెర అవకాశాలను అందుకున్నారు.ఇలా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన తర్వాత ఈమె వెండితెరపై కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇలా వరుస సినిమాలతోను వెబ్ సిరీస్ లతోను ఎంతో బిజీగా గడుపుతున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలా మృతి పరమైన జీవితంలో ఎంతో సక్సెస్ అయినటువంటి అనసూయ వ్యక్తిగత విషయానికి వస్తే… సుశాంక్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి వివాహం జరిగి 12 సంవత్సరాలు పూర్తి కావడంతో తమ 12వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇక అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా ఉన్న విషయం మనకు తెలిసిందే.

Anchor Anasuya: ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్న సుశాంక్ భరద్వాజ్…

అనసూయ ఎన్ సీసీలో ఉన్న సమయంలో సుశాంక్ భరద్వాజ్ తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక అనసూయ భర్త సుశాంక్ ఫైనాన్షియర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా పనిచేస్తున్నారు. ఈయన తన వృత్తి విషయంలో బిజీగా ఉండగా,అనసూయ సైతం సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతూ తన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago