Movie News

Nagarjuna: గోవాలో అక్రమ నిర్మాణాలను ఆపేయాలి… హీరో నాగార్జునకు నోటీసులు జారీ!

Nagarjuna: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పలు వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన గోవాలో కమర్షియల్ వినియోగం కోసం కొన్ని నిర్మాణాలను చేపడుతున్నారు. అయితే ఈ నిర్మాణాలను తక్షణమే ఆపాలంటూ నాగార్జునకు గోవా అధికారులు నోటీసులు జారీ చేశారు.

గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేశారు. మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందుగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలను చేపడుతున్నారని అందుకే ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలి అంటూ సర్పంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.

ఈ అక్రమ నిర్మాణాలను వెంటనే ఆపకపోతే పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకోబడతాయని కూడా మాండ్రేమ్ సర్జంచ్ అమిత్ సావంత్ నాగార్జునకు నోటీసుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. దీంతో నాగార్జునకు గోవాలోని నిర్మాణాలకు భారీగా షాక్ తగిలిందని చెప్పాలి.

Nagarjuna: నిర్మాణం ఆపకపోతే చర్యలు తప్పవు…


ఇకపోతే నాగార్జున ఈ విధమైనటువంటి అక్రమనిర్మాణాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈయన తెలంగాణలో ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా కొన్ని నిర్మాణాలు చేపట్టడంతో అప్పుడు కూడా అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఇప్పుడు గోవాలో కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago