Comedian Ali: తెలుగు చిత్ర పరిశ్రమలో బాల నటుడిగా అనంతరం కమెడియన్ గా, హీరోగా, ఎన్నో సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆలీ గురించి అందరికీ సుపరిచితమే.ఇక ఈయన ప్రస్తుతం బుల్లితెరపై ఆలీతో సరదాగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మందిని ప్రశ్నించిన అలీ తాజాగా ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.
యాంకర్ సుమ ఆలీని ఎన్నో రకాల ప్రశ్నలు వేసి తన నుంచి సమాధానాలు రాబట్టింది.అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అలీ తన జీవితంలో జరిగినటువంటి ఒక విషాద సంఘటన గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. తనకు తన సోదరి ఫాతిమా అంటే చాలా ఇష్టమని తెలిపారు.నాకు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక తల్లిలా తనని ప్రేమగా చూసుకునేదని నన్ను ఉదయం నిద్ర లేపి రెడీ చేసి షూటింగ్ కి పంపించే బాధ్యత అంతా తానే చూసుకునేదని తెలిపారు.
అయితే తన సోదరికి వివాహం జరిగి ఒక పిల్లాడు పుట్టాడు తర్వాత తాను గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లాడికి పాలు తాపించాలని వంటగదిలోకి వెళ్లి చున్ని ఇలా వెనక్కి వేసుకుంది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి తను మంటలో చిక్కుకుందని ఆ మంటలు భరించలేక బయటికి పరుగులు పెట్టింది. అది చూసిన అందరూ తనపై చల్ల నీళ్లు వేశారు. అయినప్పటికీ తాను కడుపులో బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు.
ఇలా తనని ఎంతో ప్రేమగా చూసుకున్న తన సోదరి చనిపోవడంతో తన పెద్ద కుమార్తెకు తన పేరే ఫాతిమా అని పెట్టుకున్నానని ఈ సందర్భంగా ఆలీ తన జీవితంలో జరిగిన ఈ విషాద సంఘటన గురించి తెలియజేశారు. ప్రస్తుతం అలీ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…