Category Archives: General News

Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?

Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.

నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా డీజీపీ ఫోటో వాడేశారు

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అదుపు లేకుండా పోతుంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. అడ్డదారుల తొక్కుతూనే ఉన్నారు. ఏకంగా తెలంగాణ డీజీపీ పేరుతో సైబర్‌ క్రైమ్‌ కు దిగారు. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో కొందరు కేటుగాళ్లు సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడుతున్నారు. డీజీపీ ఫోటో పెట్టుకొని ఓ అగంతుకుడు ఓ వ్యాపారవేత్త కుమార్తెకు వాట్సాప్ కాల్ చేశాడు. డీపీ తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటో ఉండటంతో ఆమె అగంతుకుడితో మాట్లాడింది. డ్రగ్స్ కేసు ఆమెను అరెస్ట్ చేస్తున్నామని బెదిరించాడు.

కేసు నుండి తప్పించేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే కేసు నుంచి ఎవరూ తప్పించలేరని బెదిరించాడు. అయితే.. ఆయన మాట్లాడిన తీరును అనుమానించి ఆ యువతి పోలీసులకు తన తండ్రికి చెప్పింది. ఆ వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. +92 కోడ్ తో వాట్సాప్ కాల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇది పాకిస్తాన్ కోడ్ అని సైబర్ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా సైబర్ నేరగాళ్లు ఏ మాత్రం తగ్గడం లేదు. సులభంగా డబ్బు సంపాదించడం కోసం అడ్డుదారులు తొక్కుతూనే ఉన్నారు. దాని కోసం సమాజంలో పెద్ద వాళ్ల పేర్లు వాడుతున్నారు. ఒక్కోసారి పెద్దవారి సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ కూడా హ్యాక్ చేశారు.

Palnadu: పల్నాడులో ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం?

Palnadu: పల్నాడు జిల్లాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.చిలకలూరిపేట – పర్చూరి జాతీయ రహదారిపై పసుమర్తి వద్ద బస్సు ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. తెల్లవారితే వారి గమ్య స్థానాలకు చేరుకోవాల్సిన వారు తెల్లవారుకుండానే వారి జీవితాలు అగ్ని మంటల్లో బూడిద అయ్యాయి. పసుమర్తి వద్ద ప్రయాణిస్తున్నటువంటి బస్సును ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.

ఇలా వేగంగా ప్రయాణిస్తున్నటువంటి టిప్పర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో ఆ టిప్పర్ లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి అయితే బస్సులో కూడా మంటలు చెల్లరేగడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో భాగంగా టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సు డ్రైవర్ కూడా అగ్నికి ఆహుతి అయ్యారు.

ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఆరుగురు ప్రయాణికులు కూడా సజీవ దహనం అయ్యారు.మరో 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఇక బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మరో ఇద్దరు ప్రయాణికుల జాడ కూడా ఇప్పటివరకు తెలియలేదు.
సజీవ దహనం..

ఇలా అర్ధరాత్రి కాడ నడిరోడ్డుపై ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలు ఆర్పడానికి భారీ స్థాయిలో ప్రయత్నించిన సాధ్యం కాని పరిస్థితిలు ఏర్పడటంతో ప్రయాణికులు మరణించారు. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు బాపట్ల జిల్లా నుంచి హైదరాబాద్ కు వెళ్తుంది. ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చి తిరిగి వెళుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 5వ‌ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వ‌హించారు.

ఈ ఉత్సవానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు మరియు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా హాజర‌య్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రావు గారు అతిధులగా వేదికను అలంకరించారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌ గారి తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.

ఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ కుర్చీల్లో నుంచి కదలకుండా కట్టిపడేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదిక పై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించారు.

చంద్ర‌బోస్ గారు త‌న స్వ‌గ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం రావ‌డం మ‌రొక విశేషం. ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ గారు త‌న మాట‌ల‌తో , పాట‌ల‌తో ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించారు. ఆయ‌న‌కు, “సుస్వర నాద‌నిధి” ,అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కారం చేయ‌డం జ‌రిగింది. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం ర‌క్తిక‌ట్టించ‌డం మెచ్చుకోదగ్గ అంశం..
కుమారి సంహితఅనిపిండి, శ్రీమతి ప్రత్యూష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

Kumari Aunty: కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు హైదరాబాద్లో రోడ్డు పక్కన ఫుడ్ పాత్ పై ఈమె ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ కాలం గడిపేది అయితే ఈమె వద్దకు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వెళ్లి తనని ఇంటర్వ్యూ చేయడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. దీంతో సెలబ్రిటీలు కూడా ఆమె ఫుడ్ స్టాల్ వద్దకు రావడం మొదలుపెట్టారు. ఇలా కుమారి ఆంటీ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు.

కుమారి ఆంటీ బిజినెస్ రోజు రోజుకు పెరుగుతూ పోయింది. ఈమె వద్ద తక్కువ ధరకే ఎంతో రుచికరమైనటువంటి ఆహార పదార్థాలను కడుపునిండా తినవచ్చు అనే విధంగా రివ్యూలు కూడా ఇవ్వడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా కుమారి ఆంటీ వద్ద ఫుడ్డు తినడం కోసం వచ్చేవారు అంటే తనకు ఎంత పాపులారిటీ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఇటీవల కాలంలో ఈమె ఏకంగా బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలలో కనిపించి ఈమె సెలబ్రిటీ హోదాని కూడా అందుకున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులర్ సెలబ్రిటీగా కొనసాగుతున్నారు. ఇలా రోజుకు ఇంతమంది కస్టమర్లు ఈమె ఫుడ్ స్టాల్ వద్ద ఫుడ్ తింటూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ క్రమంలోనే ఈమెకు నెలకు ఎంత మొత్తంలో ఆదాయం ఉంటుంది అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

లక్షల్లో ఆదాయం…

ఈ క్రమంలోనే కుమారి ఆంటీ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన నెల సంపాదన గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజు చేసే ఆహార పదార్థాలు అలాగే అక్కడ పనిచేసే వారికి ఇచ్చే ఖర్చులన్నీ పోను నెలకు లక్షన్నర వరకు మిగులుతుంది అంటూ ఈ సందర్భంగా కుమారి ఆంటీ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన నేటిజన్స్ ఉద్యోగం కంటే ఈ వ్యాపారమే బాగుందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Breaking News : డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.

డీఎస్సీపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు. ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులను అనుమతించే నిబంధనపై స్టే విధించిన హైకోర్టు. బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. తదుపరి విచారణ 8వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

Ayodhya: అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. విమాన టికెట్ ధర తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే?

Ayodhya: అయోధ్య.. ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ పేరు మారుమోగిపోతోంది. గత కొద్దిరోజులుగా అయోధ్య పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం కూడా లేకపోలేదు. జనవరి 22, 2024న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. దాంతో అయోధ్యకు సంబంధించిన వార్తలు విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు తీర్థయాత్రకు సిద్ధమవుతున్నారు.

అయోధ్యకు భక్తులు పోటెత్తడంతో, వారి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమాన, రైలు ప్రయాణ ఎంపికలు కూడా నిర్వహించబడ్డాయి. ఇది ఇలా ఉంటే అయోధ్యకు విమానం ద్వారా వెళ్లాలి అనుకున్న వారికి ఒక చేదు వార్త ఎదురైంది. ఎందుకంటే ఈ అయోధ్యకు వెళ్లడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుండడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో విమాన ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. జనవరి 19న ముంబై నుండి అయోధ్యకు వెళ్లే విమాన టిక్కెట్‌లను తనిఖీ చేయడం, ఇండిగో విమానం ప్రయాణానికి రూ. 20,700 కోట్ చేయడంతో అస్థిరమైన ధరలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, జనవరి 20కి సంబంధించిన ఛార్జీలు దాదాపు రూ.20,000గా ఉంటాయి.

బెంగుళూరు నుండి కూడా, విమాన ఛార్జీకి మినహాయింపు లేదు. ధరలు సుమారు రూ. 8,500కి చేరుకుంటాయి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు అయోధ్యకు విమాన ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాలను మించిపోయాయి. ఇది తీర్థయాత్ర ఖర్చులకు ఊహించని కోణాన్ని జోడిస్తుంది. అంతర్జాతీయ విమానాలతో పోల్చి చూస్తే ఈ ద్రవ్యోల్బణం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. జనవరి 19న ముంబై నుంచి సింగపూర్‌కు వెళ్లే డైరెక్ట్ ఫ్లైట్ ధరను పరిశీలిస్తే ఎయిర్ ఇండియా రూ. 10,987 కోట్ చేస్తున్నట్టు చూపుతుండగా, అదే తేదీన నేరుగా బ్యాంకాక్ వెళ్లేందుకు రూ.13,800. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు వచ్చిన పర్యాటకుల ప్రవాహం విమాన ఛార్జీలపై కాదనలేని విధంగా ప్రభావం చూపింది.

చార్జీల పెంపు…

ఈ విధంగా విమానంలో అయోధ్యకు చేరుకోవాలి అనుకున్న వారికి చార్జీల పెంపు ఊహించని షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా ధరలు పెంచేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా భక్తులకు ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా మొదలవుతున్నాయి. లక్షలాది మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి సిద్ధమవుతున్నప్పుడు, పెరుగుతున్న విమాన ఛార్జీలు ఊహించని అడ్డంకిగా నిలుస్తాయి, ఆర్థికపరమైన చిక్కులకు వ్యతిరేకంగా వ్యక్తులు తమ తీర్థయాత్ర ప్రాముఖ్యతను అంచనా వేయడానికి ప్రేరేపిస్తాయి. మరి ఈ విషయాలపై అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.