Tag Archives: eenadu

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!

Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి ఈయన గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నేడు తెల్లవారుజామున 4:50 నిమిషాలకు కన్నుమూశారు.

శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఈయనని హైదరాబాద్లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈయన పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఈయన పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు.

ఒక రామోజీరావు మరణ వార్త తెలియడంతో సినీ పరిశ్రమ అటు మీడియా రంగం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. మీడియా రంగానికి ఎన్నో సేవలు చేసిన రామోజీరావు మరణ వార్త తెలిసి ప్రముఖ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన మరణ వార్త తెలియడంతో తెలుగుదేశం అధినేతలు మరణం వార్తపై సంతాపం ప్రకటిస్తున్నారు.

అనారోగ్యంతో కన్నుమూత..

రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య ఈయన రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతో పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు. ఇలా పత్రిక రంగానికి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీ లోని తన నివాసానికి తరలించారు కూడా స్పందిస్తున్నారు.

Super Star Krishna : హీరోయిన్ లేదు.. డ్యూయెట్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారన్నారు.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.!!

Super Star Krishna : 1980 సూపర్ స్టార్ కృష్ణ మాస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. అప్పటికే 199 చిత్రాలలో హీరోగా నటించి తన సినీ జైత్రయాత్ర లో గుర్తుండిపోయే విధంగా 200లవ చిత్రం ఉండాలని మంచి కథ కొరకు వేచి చూస్తున్నారు. 100వ చిత్రంగా “అల్లూరి సీతారామరాజు” తన సినీ గమనాన్ని మార్చి వేయడంతో 200లవ చిత్రం కూడా అంతే విధంగా ఉండాలని భావించారు. ఆ క్రమంలో సోదరుడు హనుమంతరావు మలయాళంలో బాలన్ కే నాయర్, మమ్ముట్టిలు నటించిన “ఈనాడు” చిత్రాన్ని చూశారు. ఆయనకు బాగా నచ్చడంతో పద్మాలయ బ్యానర్ లో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.

మలయాళ చిత్రంలో హీరో ముసలివాడు కావున తెలుగులో ఆ పాత్రకి శ్రీధర్ ని ఎంపిక చేసుకున్నారు. దర్శకుడిగా సాంబశివరావును అనుకొని ఆయనకి ఈ కథ చెప్పారు. ఎందుకో సాంబశివరావుకి ఆ పాత్రకి కృష్ణగారు అయితే బాగుంటుందని అనిపించింది. ఆ విషయం కాస్త హీరో కృష్ణ కి చెప్పడంతో ఆ సినిమా చూసి హీరోకి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని పైగా అది వయసుమళ్ళిన పాత్ర.. మాస్ చిత్రాలతో జోరుమీదున్న నన్ను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు, తన అభిమానులు ఒప్పుకోరని చెప్పేశారు.

1980 ప్రథమార్థంలో విజయవంతమైన చిత్రాలకు కథ, సంభాషణలు అందిస్తున్న పరుచూరి సోదరులను పిలిపించి ఆ మలయాళ సినిమాని హీరో కృష్ణ చూడమన్నారు. ఆ చిత్రాన్ని చూసిన పరుచూరి సోదరులు హీరో కృష్ణకుఆ సినిమా సరిగా సరిపోతుందన్నారు. పరుచూరి సోదరులు అలా మాట్లాడడం కృష్ణకి వింతగా అనిపించింది.అందులో హీరోయిన్ లేదు పైగా వృద్ధ పాత్ర తను హీరోగా చేయడం బావుంటుందని మీరు అనడం బాగోలేదని హీరో కృష్ణ గారు అన్నారు.

కథలో మీకు తగిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ కొత్తగా రాస్తమన్నారు. కృష్ణ వారికి అవకాశం ఇవ్వడంతో పరుచూరి సోదరులు మలయాళ చిత్రంలోని వృద్ధపాత్రను యువపాత్రగా మలిచి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హీరో కృష్ణ ఇమేజ్ కు అనుగుణంగా కథ రాయడం జరిగింది. అది హీరో కృష్ణకు నచ్చడంతో తెలుగులో ఈ చిత్రాన్ని పునర్నిర్మించడానికి మరియు తను హీరోగా నటించడానికి ముందుకు వచ్చారు.

అలా 1982 జూన్ 9న చెన్నైలో ఈనాడు చిత్ర షూటింగ్ మొదలైంది. హీరో కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రం అంటే చాలా ఇష్టం అందుకే ఈ సినిమాలో హీరో పేరు రామరాజుగా పెట్టారు. చెన్నైలో కృష్ణ గార్డెన్స్ లో స్లమ్ ఏరియా సెట్ వేసి కొంత భాగాన్ని అక్కడ షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు, తెనాలిలో మరికొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అక్కడ సూపర్ స్టార్ కృష్ణ కి అభిమానులు ఎక్కువగా ఉండడంతో స్పెషల్ పోలీస్ ఫోర్స్ ని రంగంలోకి దించారు.

ఆ విధంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈనాడు చిత్రాన్ని చూసి ఓ హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నారని కొంత మంది సినీ ప్రముఖులు పెదవి విరిచారు. ఆ విమర్శలను సవాలుచేస్తూ 1982 డిసెంబర్ 17న “ఈనాడు” చిత్రం ఆంధ్రదేశమంతటా విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆనాటి అభ్యుదయ చిత్రాలకు ఈ సినిమా రాచబాట వేసింది.

మైసూరు బజ్జీ, ఇడ్లీ కేవలం ఒక్క రూపాయే.. ఎక్కడంటే..?

ఒక్కో సమయంలో ఇట్లో టిఫిన్ చేయకుంటే భయటకు వెళ్లి తినే అలావాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఒక ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు మాత్రం ఇప్పడు లేవు. ఒక్కో ప్లేట్ దాదాపు రూ.30 నుంచి రూ.70 వరకు ఉంది. హైదరాబాద్ లో అయితే హోటల్ ను బట్టి ప్లేట్ టిఫిన్ రేటు మారుతూ ఉంటుంది. అయితే చాలామంది ఇడ్లీలు అంటే ఇష్టపడుతుంటారు.

నూనెతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టీ డాక్టర్లు కూడా దీనినే తినమంటూ సలహా కూడా ఇస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకంటే.. బయట ఇడ్లీ రేట్లు ఎక్కువగా ఉంటున్నా.. ఓ భార్యభర్తలు ఇడ్లీని కేవలం రూపాయికే ఇస్తున్నారు. ఇడ్లీతో పాటు బజ్జీ కూడా అందిస్తున్నారు. అవును మీరు చదివింది.. విన్నది నిజమే. ఎక్కడంటే.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆర్ బీ కొత్తూరు గ్రామానికి చెందిన చిన్న రత్నం లక్ష్మి, చిన్న రామకృష్ణ వారి ఇంటి భయటే చిన్నపాటి హోటల్ నడుపుతున్నారు.

గత 16 ఏళ్ల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. అప్పటి నంచి ఇప్పటి వరకు రూపాయికే ఇడ్లీ, మైసూరు బజ్జీలకు అందిస్తున్నారు. ఉదయం అయిదంటే చాలు వారి ఇంటి ముందు పద్ద క్యూ కనపడుతుంటుంది. ఉదయం 4 గంటల నుంచి మొదలుకొని 10 గంటల వరకు ఈ వ్యాపారం సాగిస్తారు. తర్వాత సమయంలో ఇతర పనుల్లో బిజీ అయి పోతారు.

డబ్బు సంపాదనే కాదు.. ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఇలా తక్కువ ధరలో అందిస్తున్నామని వాళ్లు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడికి రోజూ 500 మంది వినియోగదారులు వస్తుంటారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.