ఒక్కో సమయంలో ఇట్లో టిఫిన్ చేయకుంటే భయటకు వెళ్లి తినే అలావాటు చాలా మందికి ఉంటుంది. అయితే ఒక ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రేట్లు మాత్రం ఇప్పడు లేవు. ఒక్కో ప్లేట్ దాదాపు రూ.30 నుంచి రూ.70 వరకు ఉంది. హైదరాబాద్ లో అయితే హోటల్ ను బట్టి ప్లేట్ టిఫిన్ రేటు మారుతూ ఉంటుంది. అయితే చాలామంది ఇడ్లీలు అంటే ఇష్టపడుతుంటారు.

నూనెతో సంబంధం లేకుండా ఉంటుంది కాబట్టీ డాక్టర్లు కూడా దీనినే తినమంటూ సలహా కూడా ఇస్తుంటారు. అయితే ఇదంతా ఎందుకంటే.. బయట ఇడ్లీ రేట్లు ఎక్కువగా ఉంటున్నా.. ఓ భార్యభర్తలు ఇడ్లీని కేవలం రూపాయికే ఇస్తున్నారు. ఇడ్లీతో పాటు బజ్జీ కూడా అందిస్తున్నారు. అవును మీరు చదివింది.. విన్నది నిజమే. ఎక్కడంటే.. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఆర్ బీ కొత్తూరు గ్రామానికి చెందిన చిన్న రత్నం లక్ష్మి, చిన్న రామకృష్ణ వారి ఇంటి భయటే చిన్నపాటి హోటల్ నడుపుతున్నారు.
గత 16 ఏళ్ల నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. అప్పటి నంచి ఇప్పటి వరకు రూపాయికే ఇడ్లీ, మైసూరు బజ్జీలకు అందిస్తున్నారు. ఉదయం అయిదంటే చాలు వారి ఇంటి ముందు పద్ద క్యూ కనపడుతుంటుంది. ఉదయం 4 గంటల నుంచి మొదలుకొని 10 గంటల వరకు ఈ వ్యాపారం సాగిస్తారు. తర్వాత సమయంలో ఇతర పనుల్లో బిజీ అయి పోతారు.
డబ్బు సంపాదనే కాదు.. ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో ఇలా తక్కువ ధరలో అందిస్తున్నామని వాళ్లు చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడికి రోజూ 500 మంది వినియోగదారులు వస్తుంటారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



























