Featured
Super Star Krishna : హీరోయిన్ లేదు.. డ్యూయెట్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నారన్నారు.. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్.!!
Published
2 years agoon
Super Star Krishna : 1980 సూపర్ స్టార్ కృష్ణ మాస్ చిత్రాలతో ప్రభంజనం సృష్టిస్తున్నారు. అప్పటికే 199 చిత్రాలలో హీరోగా నటించి తన సినీ జైత్రయాత్ర లో గుర్తుండిపోయే విధంగా 200లవ చిత్రం ఉండాలని మంచి కథ కొరకు వేచి చూస్తున్నారు. 100వ చిత్రంగా “అల్లూరి సీతారామరాజు” తన సినీ గమనాన్ని మార్చి వేయడంతో 200లవ చిత్రం కూడా అంతే విధంగా ఉండాలని భావించారు. ఆ క్రమంలో సోదరుడు హనుమంతరావు మలయాళంలో బాలన్ కే నాయర్, మమ్ముట్టిలు నటించిన “ఈనాడు” చిత్రాన్ని చూశారు. ఆయనకు బాగా నచ్చడంతో పద్మాలయ బ్యానర్ లో ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు.
మలయాళ చిత్రంలో హీరో ముసలివాడు కావున తెలుగులో ఆ పాత్రకి శ్రీధర్ ని ఎంపిక చేసుకున్నారు. దర్శకుడిగా సాంబశివరావును అనుకొని ఆయనకి ఈ కథ చెప్పారు. ఎందుకో సాంబశివరావుకి ఆ పాత్రకి కృష్ణగారు అయితే బాగుంటుందని అనిపించింది. ఆ విషయం కాస్త హీరో కృష్ణ కి చెప్పడంతో ఆ సినిమా చూసి హీరోకి తగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని పైగా అది వయసుమళ్ళిన పాత్ర.. మాస్ చిత్రాలతో జోరుమీదున్న నన్ను ఇలాంటి పాత్రలో ప్రేక్షకులు, తన అభిమానులు ఒప్పుకోరని చెప్పేశారు.
1980 ప్రథమార్థంలో విజయవంతమైన చిత్రాలకు కథ, సంభాషణలు అందిస్తున్న పరుచూరి సోదరులను పిలిపించి ఆ మలయాళ సినిమాని హీరో కృష్ణ చూడమన్నారు. ఆ చిత్రాన్ని చూసిన పరుచూరి సోదరులు హీరో కృష్ణకుఆ సినిమా సరిగా సరిపోతుందన్నారు. పరుచూరి సోదరులు అలా మాట్లాడడం కృష్ణకి వింతగా అనిపించింది.అందులో హీరోయిన్ లేదు పైగా వృద్ధ పాత్ర తను హీరోగా చేయడం బావుంటుందని మీరు అనడం బాగోలేదని హీరో కృష్ణ గారు అన్నారు.
కథలో మీకు తగిన కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ కొత్తగా రాస్తమన్నారు. కృష్ణ వారికి అవకాశం ఇవ్వడంతో పరుచూరి సోదరులు మలయాళ చిత్రంలోని వృద్ధపాత్రను యువపాత్రగా మలిచి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హీరో కృష్ణ ఇమేజ్ కు అనుగుణంగా కథ రాయడం జరిగింది. అది హీరో కృష్ణకు నచ్చడంతో తెలుగులో ఈ చిత్రాన్ని పునర్నిర్మించడానికి మరియు తను హీరోగా నటించడానికి ముందుకు వచ్చారు.
అలా 1982 జూన్ 9న చెన్నైలో ఈనాడు చిత్ర షూటింగ్ మొదలైంది. హీరో కృష్ణకు అల్లూరి సీతారామరాజు చిత్రం అంటే చాలా ఇష్టం అందుకే ఈ సినిమాలో హీరో పేరు రామరాజుగా పెట్టారు. చెన్నైలో కృష్ణ గార్డెన్స్ లో స్లమ్ ఏరియా సెట్ వేసి కొంత భాగాన్ని అక్కడ షూట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు, తెనాలిలో మరికొంత భాగం షూటింగ్ జరుపుకుంది. అక్కడ సూపర్ స్టార్ కృష్ణ కి అభిమానులు ఎక్కువగా ఉండడంతో స్పెషల్ పోలీస్ ఫోర్స్ ని రంగంలోకి దించారు.
ఆ విధంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈనాడు చిత్రాన్ని చూసి ఓ హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు.. హీరో కృష్ణ ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నారని కొంత మంది సినీ ప్రముఖులు పెదవి విరిచారు. ఆ విమర్శలను సవాలుచేస్తూ 1982 డిసెంబర్ 17న “ఈనాడు” చిత్రం ఆంధ్రదేశమంతటా విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆనాటి అభ్యుదయ చిత్రాలకు ఈ సినిమా రాచబాట వేసింది.
You may like
Ramoji Rao: ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు అస్తమయం!
K Viswanath – Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ, కె. విశ్వనాథ్ ఒకే స్కూల్ నుంచి వచ్చారు.. ఆ విషయాలు మీకు తెలుసా..
Sudheer Babu: ఎన్ని జన్మలెత్తినా కృష్ణ గారికి అల్లుడు గానే పుట్టాలి… ఎమోషనల్ అయిన సుధీర్ బాబు!
Ghattamaneni Family: హైదరాబాదులో సూపర్ స్టార్ కృష్ణ పెద్దకర్మ… వైరల్ అవుతున్న ఫొటోలు!
Mahesh Babu: నాన్న ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు.. తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయిన మహేష్ బాబు !!
Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ పేరిట ఉన్న ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Featured
Rana: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ పై జోక్స్ వేసిన రానా… ఫైర్ అయిన హరీష్ శంకర్?
Published
17 hours agoon
6 November 2024By
lakshanaRana: ఇటీవల రవితేజ హీరోగా డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఏ మాత్రం కలెక్షన్స్ లేకపోవడంతో డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా డిజాస్టర్ గురించి రానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.దుబాయిలో జరిగిన ఐఫా ఉత్సవం అవార్డ్స్ ఫంక్షన్ లో రానా, తేజ సజ్జా జోకులు వేశారు. రానాతో పాటు ఈ కార్యక్రమానికి తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వీరిద్దరూ సరదా సరదాగా పలు సినిమాల గురించి మాట్లాడారు.
బచ్చన్ గారు ఈ ఏడాది హైయెస్ట్ హై చూశారు లోయస్ట్ లో చూశారు అని రానా అంటే హైయెస్ట్ అయితే కల్కి మరి లోయస్ట్ లో ఏమిటి అని అడిగితే అదే ఈ మధ్య వచ్చింది కదా మిస్టర్ అంటూ ఉండగా తేజా సజ్జ ఏ అలా మాట్లాడొద్దు అంటూ ఆపారు. అయితే ఇక్కడ మిస్టర్ బచ్చన్ సినిమా గురించి పూర్తిగా చెప్పకపోయినా మిస్టర్ అని చెప్పడంతో కచ్చితంగా రవితేజ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడారని తెలుస్తుంది.
అన్ని రోజులు ఒకేలా ఉండవు..
ఇక ఈ విషయంపై రవితేజ అభిమానులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవితేజ అన్న ఎవరైతే ఇలా మీ సినిమాల గురించి మాట్లాడారో వారే క్లాప్స్ కొట్టాలి అంటే మీరు కచ్చితంగా హిట్ సినిమా చేయాలి అంటూ కామెంట్ చేయగా మరికొందరు డైరెక్టర్ హరీష్ శంకర్ ని టాగ్ చేశారు. రవితేజ గారితో ఒక సినిమా చేయాలి మళ్లీ మేము కాలర్ ఎగరేయాలి దీనికి మీ రిప్లై కావాలన్నా అంటూ పేర్కొన్నారు. దానికి హరీష్ శంకర్ ఎన్నో విన్నాను తమ్ముడు అందులో ఇదోటి. అన్ని రోజూలు ఒకేలా ఉండవు, నాకైనా ఎవరికైనా అంటూ రాసుకొచ్చారు.
Featured
Sai pallavi: సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన నాగచైతన్య… తనతో కష్టం అంటూ కామెంట్స్?
Published
17 hours agoon
6 November 2024By
lakshanaSai pallavi: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీ విడుదల కాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు నాగచైతన్య నటి సాయి పల్లవి గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా ఆమెకు సరికొత్త బిరుదు కూడా ఇచ్చారు. ఇప్పటికే సాయి పల్లవిని నేచురల్ బ్యూటీ అని లేడీ పవర్ స్టార్ అనే బిరుదులతో పిలుస్తారు తాజాగా బాక్సాఫీస్ క్వీన్ అంటూ మరో బిరుదుని ఇచ్చారు.
సాయి పల్లవి సినిమా సెట్ లో ఉంటే కేవలం తన పాత్ర గురించి మాత్రమే కాకుండా నా పాత్ర గురించి కూడా ఎంతో క్లారిటీతో ఉంటూ నాకు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలిపారు. ఇక సాయి పల్లవి తో నటించాలన్న కాస్త కష్టంగా ఉంటుంది.ఆమెతో కలిసి డాన్స్ చేయాలంటే నాకు కాస్త భయం వేస్తుంది అంటూ నాగచైతన్య ఈ సందర్భంగా సాయి పల్లవి నటన డాన్స్ పై ప్రశంసలు కురిపించారు.
డాన్స్ చేయాలంటే భయం..
గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలనిపించింది. తండేల్ చాలా గొప్ప చిత్రం అవుతుంది. నా పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులను కలిశానని అన్నారు. ఈ సినిమా జాలరి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న సంగతి తెలిసిందే.
Featured
Allu Aravind: అయ్యయ్యో…ఆ స్టార్ హీరోయిన్ ను బన్నీకి చెల్లిని చేసిన అల్లు అరవింద్?
Published
18 hours agoon
6 November 2024By
lakshanaAllu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ తాజాగా తండేల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. చందు మొండేటి డైరెక్షన్లో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి ఏడో తేదీ విడుదలకు సిద్ధమైంది.
ఇలా విడుదల తేదీన ప్రకటించడం కోసం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. ఇటీవల సాయి పల్లవి అమరన్ సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకి మంచి మార్కులే పడ్డాయి.
ఈ సినిమా గురించి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇటీవల తాను అమరన్ సినిమా చూశాను. సాయి పల్లవి తన నటనతో అందరిని అదరగొట్టేసింది. చివరిగా కన్నీళ్ళతో బరువెక్కిన హృదయంతో బయటకు వచ్చాను కారులో కూర్చుని అదే ఎమోషన్ లో సాయి పల్లవికి ఫోన్ చేసి మాట్లాడానని అల్లు అరవింద్ తెలిపారు.
కూతురితో సమానం..
నాకు కూతుర్లు లేరు కూతురు కనుక ఉండి ఉంటే సాయి పల్లవి లాగే ఉండాలని కోరుకుంటాను ఆమె నాకు కూతురుతో సమానం అంటూ ఈ సందర్భంగా అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలపై నేటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. అయ్యయ్యో ఈ స్టార్ హీరోయిన్ పట్టుకొని బన్నీకి చెల్లిని చేశారు కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు
Rana: మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ పై జోక్స్ వేసిన రానా… ఫైర్ అయిన హరీష్ శంకర్?
Sai pallavi: సాయి పల్లవికి కొత్త బిరుదు ఇచ్చిన నాగచైతన్య… తనతో కష్టం అంటూ కామెంట్స్?
Allu Aravind: అయ్యయ్యో…ఆ స్టార్ హీరోయిన్ ను బన్నీకి చెల్లిని చేసిన అల్లు అరవింద్?
Samantha: నీ ప్రేమే నాకు బలం.. సంచలనంగా మారిన సమంత పోస్ట్?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!
Saripoda Ee Dasara: ఈ దసరా పండుగకు స్పెషల్ ఈవెంట్.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా!
Pawan Kalyan: ఆ భయంతోనే జగన్ కంటే ముందుగానే అక్కడికి వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్!
YS Jagan Mohan Reddy: ఇకపై మా వాళ్లు ఆ బుక్ మైంటైన్ చేస్తారు.. రెడ్ బుక్ కు పోటిగా కొత్త బుక్?
Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!
Trending
- Featured3 weeks ago
Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!
- Featured4 weeks ago
Saripoda Ee Dasara: ఈ దసరా పండుగకు స్పెషల్ ఈవెంట్.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా!
- Featured2 weeks ago
Pawan Kalyan: ఆ భయంతోనే జగన్ కంటే ముందుగానే అక్కడికి వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్!
- Featured4 weeks ago
YS Jagan Mohan Reddy: ఇకపై మా వాళ్లు ఆ బుక్ మైంటైన్ చేస్తారు.. రెడ్ బుక్ కు పోటిగా కొత్త బుక్?
- Featured3 weeks ago
Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!
- Featured2 weeks ago
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
- Featured4 weeks ago
Ratan Tata: రతన్ టాటా ఆస్తులు విలువ ఎంత..ఆస్తికి వారసులు ఎవరు?
- Featured4 weeks ago
Rathan Tata: రతన్ టాటా మృతి… వైరల్ అవుతున్న టాటా ఆఖరి పోస్ట్!