Category Archives: Political News

Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్షలో పవన్ … అందుకే దీక్ష వేశారా?

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల పరంగా ఎన్నో బాధ్యతలను తీసుకొని పెద్ద ఎత్తున అధికారులతో సమావేశాలు సమీక్షలను నిర్వహిస్తూ అన్ని శాఖలపై ఆరా తీయడమే కాకుండా అధికారులకు సలహాలు సూచనలు కూడా ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక పవన్ కళ్యాణ్ తరచూ ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా ప్రజా సమస్యలను క్షణాలలోని పరిష్కరిస్తూ ఉన్నారు. ఇలా రాజకీయాల పరంగా ఎంతో బిజీగా అయిన పవన్ కళ్యాణ్ తాజాగా వారాహి అమ్మవారి దీక్ష వేశారు. 11 రోజులపాటు పవన్ కళ్యాణ్ ఈ దీక్షలోనే ఉండబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడంతో ఈ దీక్ష గురించి పెద్ద ఎత్తున అందరూ తెలుసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన వాహనానికి కూడా వారాహి అని పేరు పెట్టుకోవడమే కాకుండా గతంలో కూడా ఎన్నోసార్లు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఇక ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజులపాటు వేయబోతున్నారు.

11 రోజుల దీక్ష..
ఈ 11 రోజులు పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకాకుండా కేవలం పండ్లు, ద్రవాలను మాత్రమే తీసుకోబోతున్నారు. అయితే ఈ విధంగా పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష వేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే ఎన్నికలలో తన విజయం కోసమే ఈయన అమ్మవారికి మొక్కుకున్నారని అయితే ఎన్నికలలో విజయం సాధించడంతో అమ్మవారి మొక్కు తీర్చడం కోసం ఇలా దీక్ష వేశారని తెలుస్తోంది.

AP Cabinet: మొదటిరోజు ప్రారంభమైన ఏపీ క్యాబినెట్.. మెగా డీఎస్సీకి ఆమోదం?

AP Cabinet: 164 సీట్లతో ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమై అసెంబ్లీ సమావేశాలలో భాగంగా గెలిచిన వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అయితే మొదటిసారి ఏపీ క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ఇక ఏపీ క్యాబినెట్ సమావేశంలో భాగంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో భాగంగా డీఎస్సీకి ఆమోదం తెలిపారు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ విషయంపై క్యాబినెట్లో చర్చలు కూడా జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జులై ఒకటి నుంచి ప్రారంభం కాబోతుందని డిసెంబర్ లోపు పోస్టులన్నింటిని భర్తీ చేయాలని క్యాబినెట్ ఆమోదం తెలియజేసింది.

టెట్ నిర్వహణ..
ఇకపోతే గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పటికే చాలామంది టెట్ పరీక్షను కూడా రాశారు అయితే పరీక్ష ఫలితాలు ఇప్పటివరకు వెలబడలేదు ఈ క్రమంలోనే మరోసారి నిర్వహించాలని పలువురు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను కోరగా ఆయన ఈ విషయంపై త్వరలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇలా మరోసారి టెట్ నిర్వహిస్తే మరి కొంతమంది నిరుద్యోగులకు డీఎస్సీ రాసే అవకాశం కూడా కలుగుతుందని భావిస్తున్నారు.

Ap Politics: అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు ఎంత ప్రమాదమో భవిష్యత్తులో తెలుస్తాయి: శ్రవణ్ కుమార్

Ap Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై జై భీమ్‌ భారత్‌ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్‌ కుమార్‌ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసిపి పార్టీ కార్యాలయాలను కూల్చివేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ఆయన రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని అని ప్రభుత్వ కార్యాలయాలను పడగొట్టడానికా కూటమికి అధికారం ఇచ్చిందని ప్రశ్నించారు.

ఏవైనా భవనాలను కూల్చాలనుకుంటే కోర్టు ఆర్డర్‌తో కూల్చండి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కరెక్ట్‌ కాదు. రూల్‌ ఆఫ్‌ లాను టీడీపీ ఉల్లంఘిస్తోంది. పార్టీ ఆఫీసులకు అనుమతి లేదని అధికారులకు ఇప్పుడు గుర్తొచ్చిందా.. అధికారులు ఏ ప్రభుత్వము అధికారంలో ఉంటే వారికి కొమ్ము కాయడం సరికాదని ఈయన తెలిపారు. కోర్టు అనుమతి లేకుండా ఏ బిల్డింగులను కూడా కూల్చి వేయకూడదు అంతేకాకుండా కరకట్టపై ఉన్న బిల్డింగులకు ఏ ఒక్క బిల్డింగ్ కైనా అనుమతి ఉందా అంటూ ఈయన ప్రశ్నించారు.

2029 ఎన్నికలలో తెలుస్తుంది..
కరకట్ట మీద ఉన్న బిల్డింగ్స్ పడగొట్టాలని కోర్టులో పిటిషన్‌ వేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను కూడా ఈయన ఖండించారు. అంతేకాకుండా అచ్చం నాయుడు ఇటీవల అధికారుల గురించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఈయన స్పందించారు.అచ్చెన్నాయుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఎంత ప్రమాదకరమో 2029 ఎన్నికలో ఆయనకు తెలుస్తుంది. అధికారులను అరెస్ట్ చేయాలి. కలెక్టర్లను టార్గెట్ చేయాలి అనేవి మానుకోవాలి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి చేయాలి, తరిమేయాలని అనుకుంటే కుదరదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు ప్రజల ఆలోచనలకు కూడా విలువ ఇవ్వాలంటూ ఈ సందర్భంగా జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

YS Jagan: వైయస్ జగన్ ఇంటి ముందు అక్రమ కట్టడాలను కూల్చిన అధికారికి ప్రమోషన్!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోటస్ పాండులో నివాసం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో లోటస్ పాండ్ నివాసం ముందు అక్రమంగా కట్టడాలను నిర్మించారంటూ తెలంగాణ ప్రభుత్వం ఆక్రమ కట్టడాలను కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ లోటస్ పాండులోని నివాసం వద్ద బయట సెక్యూరిటీ కోసం మూడు షెడ్లను నిర్మించారు. అయితే ఇవి అక్రమంగా నిర్మించారని ఆ నిర్మాణాల వల్ల రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వాటిని కూల్చివేశారు. ఇలా ఆ అక్రమ కట్టడాలు అంటూ కూల్చివేయడంతో వెంటనే ఐఏఎస్ అధికారి హేమంత్ పై సస్పెన్షన్ వేటు పడింది.

ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆయన దగ్గరుండి ఈ కట్టడాలను కొల్చివేశారు అయితే తన పై అధికారులకు ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా కూల్చి వేయడం పట్ల ఆయనపై ప్రభుత్వం వేటు వేసింది. ఇలా సస్పెండ్ చేయడమే కాకుండా ఆయనకు ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఈ విషయం కాస్త చర్చలకు కారణమైంది.

సస్పెండ్ అయిన అధికారికి ప్రమోషన్..
ఇకపోతే తాజాగా జోనల్ కమిషనర్ గా ఉన్నటువంటి హేమంత్ సస్పెండ్ కావడంతో తిరిగి ఈయనకు పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఈయనని ప్రమోట్ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడంతో మరోసారి ఈ విషయం చర్చలకు దారితీస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హేమంత్ కి వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సమస్త ఎండిగా ప్రమోట్ చేస్తూ పోస్టింగ్ ఇవ్వడం విశేషం.

Pawan Kalyan: పవన్ యాడ్స్ చేయకపోవడానికి అదే కారణమా.. గ్రేట్ అంటూ?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా అలాగే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఇలా బిజీ అవుతున్న తరుణంలో ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయి.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగే హీరోలు మంచి గుర్తింపు పొందిన తర్వాత వారు కమర్షియల్ యాడ్స్ చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కూడా వరుసగా యాడ్స్ చేస్తూ కోట్లలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

ఇకపోతే సినీ నటుడు పవన్ కళ్యాణ్ సైతం గతంలో కోలా అనే ఒక యాడ్ చేశారు. ఈయన కేవలం డబ్బు కోసమే చేశారని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ సమయంలో తనకు పొలం కొనడానికి కాస్త ఇబ్బందిగా ఉన్న నేపథ్యంలో ఈ యాడ్ చేశానని అయితే నా తొలి చివరి యాడ్ అదేనని తెలిపారు.. ఈ యాడ్ కారణంగా ఇబ్బందులు వస్తున్నాయని తెలిసి ఇకపై చేయనని చెప్పేసాను. ఇక నాకు అప్పట్లో సల్మాన్ ఖాన్ కంటే కూడా అధికంగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్న తాను చేయలేదని తెలిపారు.

ప్రజలకు మేలు జరగాలి..
ఈ విధంగా కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ తాను ఇలాంటి వాటికి దూరంగా ఉండటానికి కారణం లేకపోలేదని పవన్ తెలిపారు.పపన్ కళ్యాణ్ అనేవాడు గొంతు విప్పితే అది ప్రజలకి మేలు జరగాలి. ప్రజల కష్టాలకు భుజం కాయాలి. ఈ రోజు పాలిటిక్స్ లోకి వచ్చి నేను ఈ మాటలు అనటం లేదు. ఇది నా సోషలిస్ట్ లక్షణం ఇది. సోషలిస్ట్ భావాలు తాలూకు ప్రతిరూపం ఇదంటూ పవన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

YS Jagan: మనకు మంచి రోజులు వస్తాయి.. భయపడొద్దు.. కార్యకర్తలకు జగన్ భరోసా?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పులివెందులలో ఉన్న సంగతి మనకు తెలిసినదే. ఈయన గత రెండు రోజుల క్రితం పులివెందులకు చేరుకున్నారు. మరో మూడు రోజులపాటు ఇక్కడే ఉండబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని కలవడం కోసం భారీగా తరలివస్తున్నారు.

ఇలా తనని కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా జగన్ మాట్లాడటమే కాకుండా వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అభిమానులకు కార్యకర్తలందరికీ కూడా ఈయన భరోసా కల్పిస్తున్నారు. ఇటీవల ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమిపాలు అయ్యారు. గత ఎన్నికలలో 151 సీట్లు గెలుపొందిన ఈయన ఈ ఎన్నికలలో మాత్రం 11 సీట్లకు పరిమితమయ్యారు.

ఇలా జగన్ ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది ఆయనని కలిసిన సమయంలో ఎమోషనల్ అయ్యారు అయితే పార్టీ కార్యకర్తలందరికీ కూడా జగన్ భరోసా ఇచ్చారు. మనకు మంచి రోజులు వస్తాయని ఎవరు అధైర్య పడవద్దని తెలిపారు. నేను మళ్లీ ప్రజలలోకి వస్తా అందరికీ అండగా ఉంటా.. రాబోయే రోజులు మనవి అంటూ ఈయన భరోసా కల్పించారు.

మళ్లీ ప్రజలలోకి వస్తా..
ఇకపోతే మరి కొంతమంది కాంట్రాక్టర్లు కూడా జగన్మోహన్ రెడ్డిని కలిశారు.పులివెందుల పట్టణాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా విడుదల కావాల్సిన 100 కోట్లు బిల్లులు ఇంకా విడుదల కాలేదనే విషయాన్ని ఈయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ విషయం తన వరకు ఎందుకు తీసుకురాలేదంటూ అధికారుల పట్ల జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కోర్టుకు వెళ్లి అయినా సరే మనం బిల్లులను తెచ్చుకుందాం అంటూ ఈయన వారికి భరోసా ఇచ్చారు.

Hyper Aadi: పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బెదిరింపులకు పాల్పడిన హైపర్ ఆది?

Hyper Aadi: హైపర్ ఆది జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ ఎంతో సుపరిచితమే. ఈయన తన అద్భుతమైన కామెడీ పంచ్ డైలాగులతో ప్రేక్షకులందరికీ మెప్పించారు. ఈయన మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల పిఠాపురంలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా నిలిచారు.

ఇక పవన్ కళ్యాణ్ ని గెలవడంతో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ట్రెండ్ ఆది భారీగా ఉపయోగించుకుంటున్నారు. బుల్లితెరపై ప్రసారమవుతున్న ఢీ షో లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో డాన్స్ మాస్టర్‌ పండు అండ్ టీమ్‌ ఆదితో కలిసి ఓ స్కిట్‌ ప్రదర్శించారు.

పిఠాపురం గుర్తుందా.
ఈ స్కిట్ లో భాగంగా ఇద్దరి మధ్య మాటలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే పండు మాస్టర్ నువ్వు ఎంత చెప్పినా ఈ రోజు తగ్గేదెలే అన్నాడు. అడ్డొస్తే తొక్కి పడేస్తా అంటూ హైపర్‌ ఆదిని బెదిరించాడు . దీంతో హైపర్ ఆది రియాక్ట్ అవుతూ రేయ్ మనం ఎవరి తాలూకాలో తెలుసు కదా..నీకు పిఠాపురం గుర్తుందా అంటూ వార్నింగ్‌ ఇస్తూ వెళ్లిపోయాడు హైపర్‌ ఆది. దీంతో ఇది హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి షోలోనూ పవన్‌ కళ్యాణ్‌ పేరు చెప్పి, పిఠాపురం పేరు చెప్పి బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ లేటెస్ట్ ప్రోమో వైరల్‌ అవుతుంది.

YS Jagan: జగన్ ఇంటిపై దాడి.. తప్పుడు వార్తలను ఖండించిన వైసీపీ.. జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి పులివెందులకు చేరుకున్నారు. నిన్న ఈయన కడప ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గనా పులివెందులకు వెళ్లారు. అయితే పెద్ద ఎత్తున అభిమానులు ఈయనకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఇక పులివెందులలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే పులివెందులకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. జగన్ పై వ్యతిరేకత ఉండటంతోనే ఆయన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఇంట్లో గ్లాసులను పగలగొట్టారు అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారు అయితే ఈ వార్తలపై వైసీపీ స్పందించింది.

జగన్ ఇంటి పై దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు తర్వాత మొదటిసారి పులివెందులకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని దీంతో కాస్త పెనుగులాట చోటు చేసుకోవడం వల్ల ఇంట్లో గాజు సామాన్లు పగిలిపోయాయని అంతకుమించి ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు.

జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు..

ఇక జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత పులివెందులకు రావడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది అయితే పోలీసులు వారందరినీ కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు దీంతో నేడు జగన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. మరో నాలుగు రోజులపాటు జగన్ పులివెందులలోనే ఉంటూ అక్కడ నాయకులతో సమావేశం కానున్న సంగతి తెలిసిందే.

AP Assembly: అసెంబ్లీలో నోరు జారిన ఎమ్మెల్యే.. లేట్ చంద్రబాబు నాయుడు అంటూ?

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా ఆరోజు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక శనివారం ఈ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా స్పీకర్ గురించి పార్టీ అధినేత చంద్రబాబు గురించి మాట్లాడారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా మొదటిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి. ఈమె మాజీ ఎమ్మెల్యే మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు అనే సంగతి తెలిసిందే. ఇలా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన ఈమె ఇంగ్లీష్ లో ప్రసంగించారు. ఇలా సింధూర రెడ్డి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.

చంద్రబాబు గారి హయంలో తాను ఎమ్మెల్యే కావడం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలిపారు. ఇక ఈమె సీనియర్ ఎన్టీఆర్ గురించి కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే లేట్ ఎన్టీఆర్ అనబోయి లేట్ చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడారు. అయితే తన తప్పును గ్రహించిన సింధూర రెడ్డి వెంటనే సారీ అంటూ క్షమాపణలు కూడా చెప్పారు.

తెలుగులో మాట్లాడొచ్చు కదా..
ఇలా ఈమె తొందరపాటు కంగారులో లేట్ ఎన్టీఆర్ అనబోయి లేట్ చంద్రబాబు నాయుడు అని చెప్పడంతో నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే మొదటిసారి ఈమె ఎమ్మెల్యేగా ఎంపిక కావడంతో కంగారులో మాట్లాడి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. కానీ కొంతమంది మాత్రం ఈమె స్పీచ్ గురించి కామెంట్లు చేస్తున్నారు స్పష్టంగా తెలుగులో మాట్లాడొచ్చు కదా.. ఇలా ఇంగ్లీషులో మాట్లాడి తెలుగులో ఆ గౌరవ పరచడం ఏంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

KK Survey:  వైసిపి ఓటమికి అదే ప్రధాన కారణం.. ఒక్క మాటలో చెప్పిన కేకే సర్వే!

KK Survey: కేకే సర్వే రాష్ట్ర రాజకీయాలలో మాత్రమే కాదు దేశ రాజకీయాలలోనే  సంచలన సర్వే సంస్థగా నిలిచిపోయింది. కిరణ్ కొండేటి ఏపీ రాష్ట్ర రాజకీయాలపై సర్వే నిర్వహించి ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే విషయంపై స్పష్టత ఇచ్చారు. 2019 ఎన్నికలలో వైసీపీ 151 సీట్లతో అధికారంలోకి రాబోతుందని తెలిపిన కేకే సర్వే 2024వ సంవత్సరంలో కూటమి 160 సీట్ల మెజారిటీ అందుకోబోతుందని వెల్లడించారు.

ఇలా కేకే సర్వే ఇలాంటి ఫలితాలు రాబోతున్నాయని చెప్పడంతో ఎంతోమంది విమర్శలు కూడా చేశారు. కేకే అంటే కమ్మ కాపు సర్వే అని విమర్శల వర్షం కురిపించారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పిన దానికంటే కూడా కూటమికి అదనంగా మరో నాలుగు సీట్లు రావడంతో ఒక్కసారిగా కేకే సర్వే సంచలనంగా మారింది.

ఇలా కేకే సర్వే చెప్పిన విధంగానే ఫలితాలు రావడంతో కూటమి నేతలు ఈయనకి ఇటీవల సన్మానం కూడా చేశారు. ఈ సన్మాన సభలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా కుప్పకూలి పోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా ఒక్క మాటలో చెప్పేశారు.

సంక్షేమానికి పరిమితం కావటం..
గతంలో 151 సీట్లతో అధికారాన్ని అందుకున్న జగన్మోహన్ రెడ్డి ఇలా 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడానికి ప్రధాన కారణం వైయస్ జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకోవడం అని తెలిపారు. ఇలా సంక్షేమానికి దగ్గరైన ఈయన ప్రజాదరణ కోల్పోయారని దీంతో రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయారని అదే ఆయన ఓటమికి కారణమంటూ కిరణ్ కొండేటి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.