ప్రజలకు శుభవార్త.. సమర్థవంతంగా పని చేస్తున్న కరోనా వ్యాక్సిన్..?

గతేడాది నవంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో కరోనా వైరస్ విజృంభించగా నిన్నటితో తొలి కరోనా కేసు నమోదై ఏడాదైంది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వైరస్ పుట్టుకకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్ అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లాన్సెట్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ లో చైనా కరోనా వ్యాక్సిన్ అధ్యయనానికి సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ కరోనా వ్యాక్సిన్ వైరస్ ను ఎదుర్కొనే సమర్థవంతమైన యాంటీబాడీలను సృష్టించినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లపై ఏప్రిల్ నుంచి మే నెల వరకు జరిపిన పరిశోధనల్లో తక్కువ డోస్ ఇచ్చినా యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించడం లేదని కోలుకున్న వారిలో ఉత్పత్తి అయినా యాంటీబాడీలతో పోల్చి చూస్తే వ్యాక్సిన్ ద్వారా వచ్చిన యాంటీబాడీలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. వ్యాక్సిన్ తొలి డోస్ కు, రెండో డోస్ కు మధ్య గ్యాప్ ఉంటే మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను అత్యవసరాల కోసం వినియోగించవచ్చని చెబుతున్నారు.

రెండు వారాల వ్యవధిలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ను ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్ ను ఉపయోగించవచ్చని వెల్లడిస్తున్నారు.