Chiranjeevi : ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవం చాలా దారుణం… ఇప్పటికీ ఆ సినిమా అంటేనే భయపడుతాను..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి భయపడిన సంఘటనను ఇటీవల పంచుకున్నారు. మెగాస్టార్ సినిమా ఫస్ట్ డే చూడాలని దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మందే ఉంటారు. మరి అలాంటి మెగాస్టార్ కూడా ఫస్ట్ డే సినిమా చూడాలని వెళ్లి తన తండ్రి చేతుల్లో దెబ్బలు తిన్న సంగతి గురించి ఇటీవల ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడారు. ఆ ఈవెంట్ కు ముఖ్య అతిధి గా వచ్చిన చిరు సినిమా లో నటించిన వారికి మంచి కెరీర్ ఉండాలని ఆకాంక్షించారు.

రాము సినిమా చూడటానికి మొదటి ఆటకు వెళితే…

ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా నిర్మాత ఏడిద నాగేశ్వరావు గారి మనవరాలు శ్రీజ అవ్వడంతో ఆమె కోసం చిరు ఈ ఈవెంట్ కి వచ్చారు. ఏడిద నాగేశ్వరావు గారు నాకు ఆప్తులు, ఆయన కుటుంబం లో వ్యక్తిలా నన్ను చూస్తారు, ఆయన కుటుంబంలో ఒక వ్యక్తిగా ఈ ఈవెంట్ కి వచ్చానని చెప్పారు. ఇక ఇండస్ట్రీ లో నిర్మాతలుగా అమ్మాయిలు రావడం చాలా అవసరమని చెప్పారు. మా ఇంటినుండి నిహారిక సుస్మిత ను మేము ప్రోత్సాహిస్తున్నాము, శ్రీజ కూడా నిర్మాత్తగా మంచి చిత్రాలను నిర్మించి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇక సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు తో పాటు డైరెక్టర్స్ వంశీధర్, లక్ష్మి నారాయణలకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక యాంకర్ సుమ మీ ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాలేమైనా ఉన్నాయా అని చిరంజీవిని అడుగగా… ఆయన ‘రాము’ సినిమా చూడటానికి తన బంధువుల అబ్బాయితో కలిసి వెళ్లిన సంఘటనను గుర్తుచేసుకున్నారు. నెల్లూరు లో ఉండే సమయంలో మా చుట్టాలబ్బాయి పూర్ణ అనే అబ్బాయి ఎన్టీఆర్ వీరాభిమాని కావడంతో నన్ను నాగబాబుని రాము సినిమాకు తీసుకెళ్లాడు. మమ్మల్ని ఎప్పుడు నాన్న కుర్చీ టికెట్ కి కూర్చోబెట్టి సినిమాలు చూపించేవారు. అయితే పూర్ణ నేల టికెట్ తీసుకుని సినిమా చూసేవాడు. అలా మొదటి సారి నేల టికెట్ తీసుకుని వాడితో నాగబాబు ని తీసుకుని సినిమాకు వెళ్ళాము.

అక్కడ క్యు మధ్యలో ఆగిపోయింది చీకటి గోడలమధ్య లో ఆగిపోయాం. అప్పటికే మాకు ఊపిరి ఆడటం లేదు లాభం లేదని బయటికి వచ్చేసాం. అంతలో ఎదురుగా మా నాన్న మా అమ్మతో పాటు సినిమా చూసి బయటికి వచ్చారు. మమ్మల్ని అక్కడ చూసి అప్పటికే చమటలు పట్టి బిక్కమొహం వేసుకుని చూస్తున్న వాడిని చూసి థియేటర్ స్థంబాలకు కట్టి కొబ్బరి మట్ట విరుచుకుని జనంలో ఊపిరి ఆడక వాడు చనిపోతే ఏంటి పరిస్థితి అంటూ నన్ను చితక్కొట్టుడు కొట్టాడు, ఆరోజును మరచిపోలేను. అప్పటి నుండి రాము సినిమా ఆనగానే ఇంకా ఆ భయం అలాగే గుర్తుంది అంటూ అప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు.