Movie News

Kotha Kothaga Review: యూత్ ఫుల్ లవ్‌ ఎంటర్‌టైనర్ “కొత్త కొత్తగా” మూవీ రివ్యూ !

సినిమా : “కొత్త కొత్తగా
న‌టీన‌టులు- అజయ్, వీర్తి వఘాని, ఆనంద్ (సీనియర్ హీరో), కాశీ విశ్వనాధ్, తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి త‌దిత‌రులు.
దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి
నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర
బ్యానర్: ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్
స‌మ‌ర్పకులు: బి జి గోవింద రాజు
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కెమెరా- వెంకట్
ఫైట్ మాస్టర్: పృధ్వీ శేఖర్
ఆర్ట్ డైరెక్టర్: సురేష్ భీమగాని

ప్రస్తుతం టాలీవుడ్‌లో విభిన్న కథా చిత్రాల జోరు సాగుతుంది. అయినప్పటికీ లవ్ ఎంటర్‌టైనర్స్ కి బాగా స్కోప్‌ ఉంది.ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేసేలా, ఎంగేజ్‌ చేసేలా ఉంటే మంచి ఆదరణ పొందుతూ.. బాక్సాఫీసు వద్ద విజయాలు సాధిస్తున్నాయి. అలాంటి మంచి యూత్ ఫుల్ లవ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ తో వచ్చిన చిత్రం “కొత్త కొత్తగా”.

ఫన్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శక‌త్వంలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు. బి జి గోవింద రాజు చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 9న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో థియేటర్ లో చూద్దాం పదండి..

ఆనంద్ (సీనియర్ హీరో),కల్యాణి నటరాజన్ ల కూతురు రాజీ (వీర్తి వఘాని)., విశ్వనాధ్,తులసి ల కొడుకు సిద్దు (అజయ్) లిద్దరూ రఘు ఇంజినీరింగ్ కాలేజ్ లో చదువుకుంటుంటారు. అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని రాజీ ని చూడగానే సిద్దు ఇష్టపడతాడు.రాజీ కోసం సిద్దు తన ప్రాణం కుడా ఇచ్చేంతగా ప్రేమిస్తుంటాడు. మరో వైపు రాజీ అన్న కేశవ్ తన చెల్లికి దగ్గరి సంబంధం కాకుండా దూరం సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు.అయితే కేశవ్ బామ్మర్ది రామ్ (పవన్ తేజ్) తన అక్క సత్య (లావణ్య రెడ్డి) తో రాజీ అంటే చాలా ఇష్టం తనని పెళ్లి చేసుకొంటాను అంటాడు. రామ్ తల్లి తండ్రులు రాజీవ్ ఫ్యామిలీ తో మాట్లాడడంతో మొదట కేశవ్ కు ఇష్టం లేకపోయినా చివరికి ఒకే అనడంతో
రామ్ తో రాజీకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. రాజీకింకా చదువు కోవాలని ఇష్టమున్నా తల్లి తండ్రుల మాట కాదనలేక, ఇటు సిద్దు తనకోసం ప్రాణం ఇవ్వడానికి సిద్దపడ్డాడన్న విషయం తెలుసుకొని తనను దూరం చేసుకోలేక తన జీవితంలో రాజీ ఎలాంటి సంఘర్షణ ను ఎదుర్కొంది? తల్లి తండ్రుల మాట కాదనలేక తన బాధ ని భయాన్ని మనసులో పెట్టుకొని రామ్ ను పెళ్లి చేసుకోందా? లేక తనను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే సిద్దుని పెళ్లిచేసుకుందా? అలాగే అజయ్ తను ప్రేమించిన రాజీ కోసం ఏం త్యాగం చేశాడు? చివరికి రాజీ ప్రేమను దక్కించుకున్నాడా లేదా? అనేది తెలుసు కోవాలంటే “కొత్తగా కొత్తగా” సినిమా చుడాల్సిందే

నటీ నటుల పనితీరు

హీరో గా సిద్దు పాత్రలో నటించిన విజయ్ లో చాలా ఫైర్ వుంది. తొలి సినిమానే చాలా అనుభవం వున్న నటుడిగా చాలా ఈజ్ గా చేశాడు. రాజీ (వీర్తి వఘాని) ఒక పెద్దింటి పల్లెటూరు అమ్మాయిగా అద్భుతమైన నటనను ప్రదర్శించింది.రొమాన్స్ లోను, ప్రేమలోనూ తను అన్ని బావోద్వేగాలను చాలా బాగా వ్యక్త పరచింది.ఈ సినిమాలో అజయ్‌, వీర్తి పెయిర్ చాలా క్యూట్ గా ఉంది.రాజీ అన్నగా కేశవ్ (అనిరుద్ ) రఫ్ క్యారెక్టర్ లో ఒదిగిపపోయాడు ,రాజీ బావగా రామ్ (పవన్ తేజ్), రాజీ కి వదినగా సత్య (లావణ్య రెడ్డి) లు చక్కటి నటనను ప్రదర్శించారు. బస్ స్టాప్,ఈ రోజుల్లో ఫెమ్ సాయి హీరో ఫ్రండ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అలాగే వాసు మంచి రోల్ చేశాడు.. ఇంకా ఈ సినిమాలో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పని తీరు….

ఇప్పుడు వస్తున్న సినిమాలకు డిఫరెంట్ గా ప్రాపర్ కంటెంట్ తో టైటిల్ లో వున్న కొత్తదనం సినిమాలో వుండేలా పర్ఫెక్ట్ చూసుకుంటూ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు సర్ప్రైజ్ చేస్తూ దర్శకుడు హనుమాన్ వాసం శెట్టి టైటిల్ లో “కొత్తగా కొత్తగా” వున్నట్టే చిత్రంలో కుడా కొత్త దనంతో చాలా చక్కగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు సిద్ శ్రీరామ్ పాడిన ప్రియతమా పాట చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది., అలాగే డైమండ్ రాణి పాటలు ఇలా ఈ చిత్రంలో అన్ని పాటలు చాలా బాగున్నాయి అనంత శ్రీరామ్ కాసర్ల శ్యామ్, శ్రీమణి చక్కగా పాటలు రాశారు అనురాగ్ కులకర్ణి, మిగతా గాయకలు అద్భుతంగా పాడారు. అందుకే పాటలు కొత్తగా వచ్చాయి. హరి కిరణ్ మాస్టర్ ఎంతో అందంగా కోరియోగ్రఫీ చేశారు. వెంకట్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఎడిటర్ ప్రవీణ్ పూడిగారు చక్కగా ఎడిటర్ చేశారు.ఫన్ ఫుల్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు మురళీధర్ రెడ్డి ముక్కర, గోవింద రాజుగారు ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను చాలా చక్కగా నిర్మించారు.ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏ జరుగుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు కలిగిస్తుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేలా ఉన్న ఈ సినిమా చివరవరకు ప్రేక్షకులని యంగేజ్ చేస్తుంది. “కొత్త కొత్తగా” సినిమా.టికెట్ కొనుక్కొని వచ్చిన ప్రతి ప్రేకక్షకుడికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుందని కచ్చితంగా చెప్పగలను

రివ్యూ రేటింగ్ : 3/5

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago