Chiranjeevi : ఫోటోషూట్ ఆపండి… చిరంజీవికి అవమానం?? గరికపాటి వాఖ్యలపై నాగబాబు సటైర్లు : ఇమంది రామారావు

Chiranjeevi : ప్రతి ఏడాది బీజేపీ లీడర్ దత్తాత్రేయ గారు అలాయ్ బలయ్ నిర్వహిస్తూ ఉంటారు. రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులను పిలిచి విందు ఏర్పాటు చేస్తుంటారు. ఇది ప్రతి ఏడాది జరిగేదే. అయితే ఈ సారి ఆ వేడుకలో ఒక చిన్న వివాదం చోటు చూసుకుంది. సినిమా ఇండస్ట్రీ నుండి హాజరైన ప్రముఖుల్లో చిరంజీవి గారు ఉన్నారు. ఆయనతో ఫోటోదిగాలని ఎవరికి ఉండదు, అలా ఆయనతో సెల్ఫీలు తీసుకుంటుండగా ప్రవచనాలతో అందరినీ ఆకట్టుకునే గరికపాటి గారు ఆయన పై అసహనం వ్యక్తం చేసారు. చిరంజీవి గారు ఆయన అసహనానికి చిరాకు పడకుండా ఫోటోలు దిగడం ఆపేసి వచ్చారు. ఇక ఈ ఇష్యూ మీద్స్ నాగబాబు గారు గరికపాటి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మొత్తం ఇష్యూలో అసలు తప్పెవరిది అన్న అంశం మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడారు.

ఎక్కడ నెగ్గాల్లో కాదు ఎక్కడ తగ్గాలో తెలుసు…

ఇమంది గారు మాట్లాడుతూ చిరంజీవి గారికంటే వయసులో చిన్నవాడైన గరికపాటి నరసింహారావు గారు అలా మైక్ లో అసహనాన్ని వ్యక్తం చేయడం తప్పు. అయితే ఇక్కడ చిరంజీవి గారు చాలా హుందగా వ్యవహారించారు. అది నటన కాదు డిప్లొమసీ ముందు పుట్టి చిరంజీవి ఆ తరువాత పుట్టారు అన్నట్లుగా ఆయన శైలి ఉంటుంది. ఎవరినీ అంత త్వరగా నొప్పించేలా మాట్లాడారు. ఆ ప్రోగ్రాములో కూడా ఫోటోషూట్ ఆయన తప్పు కాదు, ఆ వేడుకను కో ఆర్డినేట్ చేస్తున్న వాళ్ళు ఇలాంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి.

ఒకవైపు ప్రవచనాలు పెట్టినపుడు మరో వైపు ఫోటో తీసుకోడాన్ని అనుమతిచ్చిండకూడదు. ఇక నాకు అహంభావం ఎక్కువ అని చెప్పే గరికపాటి గారు అది ప్రదర్శింపకూడదు అనే విషయాన్ని కూడా గ్రహించాల్సింది. అయినా కూడా ఆయన తప్పు ఏమాత్రం లేకపోయినా చిరంజీవి గారు ఒక్క మాట మాట్లాడకుండా ఫోటో తీయుంచుకోవడం ఆపి వచ్చేసారు. అయితే ఇష్యూ లో నాగబాబు స్పందించడం గరికిపాటి గారి మీద విమర్శలు చేయడం బాగోలేదు. ఆయన ఇమేజ్ ముందు నువ్వెంత అనేలా నాగబాబు మాట్లాడారు అది తప్పు అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు.