Balakrishna:టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ వంటి వారి తర్వాత జనరేషన్ లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి హీరోలు. ఇక ఈ జనరేషన్ లో నెంబర్ వన్ హీరో ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతారు. అయితే చిరంజీవి కన్నా ముందుగా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో స్థానంలో కొనసాగారు బాలయ్య.
అయితే బాలయ్య నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఊహించని విధంగా సుమన్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. అయితే కొన్ని కారణాల వల్ల సుమన్ అతి తక్కువ సమయంలోనే ఫెయిడౌట్ అయ్యారు.ఇక మెగాస్టార్ ఎంట్రీ ఇవ్వడంతో ఆయనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ వచ్చారు.ఇక వీరి వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరి హవా కొంతమేర తగ్గిందని చెప్పాలి.
ఇక మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఆ తర్వాత కొన్ని రోజులపాటు సినిమాకు విరామం ప్రకటించారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోతున్నాయని నిరూపించాయి. ఇక నాగార్జున బాలకృష్ణ పరిస్థితి కూడా అదే స్థాయిలో ఉంది. ఇక నిన్న విడుదల అయిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు రూ.16.68 కోట్ల షేర్ రాబట్టింది.
అదేవిధంగా నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా రూ.2.42 కోట్ల రూపాయలు రాబట్టింది వెంకటేష్ ఈ మధ్యకాలంలో వరుస మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఈయన సినిమాలు కూడా ఎప్పుడు మొదటి రోజు 10 కోట్ల షేర్స్ రావట్లేదు.ఇక మిగిలినది నందమూరి నటసింహం బాలకృష్ణ ఈయన తాజాగా నటించిన చిత్రం అఖండ. అఖండ సినిమా విడుదల అయినా మొదటి రోజు ఏకంగా రూ. 18.04 కోట్ల షేర్ ను రాబట్టింది.దీన్ని బట్టి చూస్తే సీనియర్ హీరోలలో బాలకృష్ణనే ఫుల్ ఫామ్ లో ఉన్నారని మిగిలిన హీరోల హవా తగ్గిపోయిందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…