Movie News

Big boss Revanth : నాగార్జున మీద ఆ విషయంలో గుర్రుగా ఉన్న సింగర్ రేవంత్ అభిమానులు…!

Big boss Revanth : బిగ్ బాస్ తెలుగులో మొదటి రియాలిటీ షో సీజన్ 6 మొదలై అపుడే ఎలిమినేషన్లు, గొడవలు అంటూ సాగుతోంది. బిగ్ బాస్ కొత్త సీజన్ ఎపిసోడ్స్ ప్రస్తుతం రేటింగ్స్ లేక విలవిలలాడుతోంది. షోలో కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ సరిగా లేక చప్పగా ఉన్నాయి ఎపిసోడ్స్. అయితే ఇపుడిపుడే ఇంట్రెస్ట్ పెంచుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్లు, టాస్క్ ఆడేటపుడు గొడవలు, బూతులు తిట్టుకోవడం అన్నీ మొదలై ప్రేక్షకులకు ఇంట్రస్ట్ పుట్టిస్తున్నాయి. ఇక షోలో ఎలిమినేషన్స్ నామినేషన్స్, టాస్కులు అంటూ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ గోలలో కొన్నిసార్లు ఫ్యామిలీ సెంటిమెంట్స్ కూడా కనిపిస్తాయి. ఎప్పటిలాగే హౌస్ లో ఉన్న వారికి ఫ్యామిలీని గుర్తుకుతెప్పించి ఏడిపిస్తాడు బిగ్ బాస్.

రేవంత్ కు శ్రీమంతం అంటూ నాగార్జున జోకు… సీరియస్ అయిన రేవంత్ ఫ్యాన్స్…

సింగర్ రేవంత్ ఇప్పుడు బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓటింగ్ లో టాప్ ప్లేసులో ఉంటూ టాప్ 5 లో ఖచ్చితంగా ఉండే ఇంటి సభ్యుడిగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన వ్యక్తి. ఇక ఇంట్లో అందరూ తనని వ్యతిరేకించినా ఏం చేసినా స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతున్నాడు. ఇక అలానే బయట ఎంతో మంది ఫ్యాన్స్ సంపాదించుకున్నాడు. తాజాగా జరిగిన ఒక ఇష్యూ ఇప్పుడు రేవంత్ ఫ్యాన్స్ కి అస్సలు నచ్చడం లేదు. నాగార్జున మీద బాగా కోపంగా ఉన్నారు. నిజానికి రేవంత్ భార్య అన్విత నిండు గర్భిణీ, ఇది అందరకీ తెలిసిన విషయం. అయితే ఆమెకు బిడ్డకు మంచి జరగాలని సీమంతం వేడుక చేసారు. ఇక ఈ వీడియో ని బిగ్ బాస్ రేవంత్ కి చూపించగా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇక ఈ విషయాన్ని నాగ్ శనివారం లేవనెత్తి రేవంత్ కి కూడా సీమంతం చేయొచ్చుగా అంటూ హౌస్ మేట్స్ కి ఉప్పందించాడు.

ఇక గీతూ వెంటనే అందుకొని నేను చెప్పాను నీకు ఇక్కడ సీమంతం చేద్దామని, నీ భార్య ప్రెగ్నెంట్ అయితే నువ్వు ప్రెగ్నెంట్ అయినట్లే నీకు దీవెనలు ఇస్తామని చెప్పాను అనగానే బాలాదిత్య కూడా తన వాదన కలిపాడు. ఫిజికల్ గా మగాడు ప్రెగ్నెంట్ కాకపోయినా మానసికంగా తల్లి బిడ్డ కోసం ఎంత ఎంజాయ్ చేస్తుందో తండ్రి కూడా అంతే కాబట్టి అదొక మంచి మెమొరీ కాబట్టి అలాచేద్దామని అన్నాను అంటూ బాలాదిత్య వివరించాడు. ఇక మధ్యలో నాగార్జున దూరి అయితే సీమంతం చేద్దామంటావా అంటూ బిగ్ బాస్ ను అందరూ రిక్వెస్ట్ చేసుకొండి అంటూ అందరికీ హింట్ ఇచ్చాడు. ఈ విషయం రేవంత్ అభిమానులకు ఏ మాత్రం నచ్చడం లేదు, ఏంటి మరీ ఇలా నాగ్ చేస్తున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago