Featured

Balakrishna : మనవళ్ళు బాలయ్య ను అలా అంటారట… అన్ స్టాపబుల్ లో క్రేజి కామెంట్స్ చేసిన బాలయ్య..!

Balakrishna : బాలయ్య బాబు అనగానే మాస్ కా బాప్ అనేలా ఉంటుంది ఫ్యాన్ ఫాలోయింగ్. ఒకవైపు నందమూరి లేగసీ కాపాడుతూ మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని ఇటు హిందూపురం ఎమ్మెల్యే గా రాజకీయాలలో కంటిన్యూ అవుతూ మరో వైపు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తు ఇంత ఇమేజ్ ఉన్న బాలయ్య చాలా సింపుల్ గా ఉంటారు. సెట్ లో ఉన్నపుడు అందరితో కలిసే ఉంటారు, ప్రత్యేకంగా హీరో అని క్యారవాన్ లో కూర్చొని ఉండే రకం కాదు. ఇక ప్రేమించినా, కోప్పడ్డా బాలయ్య బాలయ్యే. అందరికీ ఏజ్ పెరిగితే అలుపొస్తుంది కానీ బాలయ్య ఊపొస్తుంది అన్నట్లుగా ఇంకా ఎనర్జిటిక్ గా సినిమాలను చేస్తూ మరో వైపు ఆహా ఒరిజినల్స్ లో అన్ స్టోపబుల్ షో చేస్తూ రచ్చ చేస్తున్నాడు బాలయ్య.

బాలయ్య మనవళ్లు ఏమంటారంటే…

అన్ స్టోపాబుల్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఆ ఒక్క షోతో ఆహా సబ్ స్క్రిప్షన్స్ బాగా పెరిగాయి. ఇక రేటింగ్స్ లోనూ రికార్డులు సృష్టించింది అన్ స్టాపబుల్. సీజన్ వన్ ఆ రేంజ్లో హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక సెకండ్ సీజన్ కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు ప్రేక్షకుడు కూడా ఎదురుచూస్తున్నాడు. ఇక అన్ స్టోపాబుల్ సీజన్ రెండు త్వరలో రాబోతోంది ,ఇక దీనికి సంబంధించిన ప్రోమో కుడా విడుదల చేసారు. విజయవాడ లో చేసిన ఈవెంట్ కి మంచి రెస్పన్స్ కూడా వచ్చింది. ఇక షో గురించి బాలయ్య క్రేజీ కామెంట్స్ చేసారు.

షో కి చిరు, వెంకీ, నాగ్ వస్తారని చెప్పారు. సినిమాల్లో బిజీగా ఉంటే ఫ్యామిలీ మొత్తం చూసుకుంది వసుంధరనే అంటూ ఆమె నిజమైన అన్ స్టాపబుల్ నా లైఫ్ లో అంటూ చెప్పారు. ఇక యాంకర్ మిమ్మల్ని మావయ్య అని పిలవచ్చా అని అడుగగా నా మనవళ్లే నన్ను తాతయ్య అని పిలవరు నువ్వు నన్ను మావయ్య అంటావా అని అనగానే యాంకర్ మరి మీ మనవళ్లు ఏమని పిలుస్తారు మిమ్మల్ని అని అడిగితే బాలా అంటారు అంటూ చెప్పారు. ఇక సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారు మొదటి గెస్ట్ గా రాబోతున్నారు అంటూ ఊహగానాlలు వినిపిస్తున్నాయి. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోందో ఇంకెంత హిట్ అవుతుందో వేచి చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago