పాపం.. ఆ యాక్షన్ హీరోని పక్కన పెట్టేస్తున్నారు..??

కరోనా మహమ్మారి మరోసారి సినిమా ఇండస్ట్రీపై గట్టి దెబ్బే వేసింది.. ప్రస్తుతం సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా షూటింగ్లన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి..అయితే ఏది ఎలా ఉన్నా కాని మన తెలుగులో ఉన్న ప్రతి స్టార్ హీరో ఫుల్ బిజీగా సినిమాలు ఒప్పుకుంటున్నారని అని తేలింది..అందులో ఒక్క హీరో తప్ప. అతనికి యాక్షన్ హీరో అనే ఇమేజ్ ఉంది..ప్రస్తుతం అతని చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది, అలాగే మరో సినిమా రిలీజ్ కి రెడీ అయి కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది.

.అయితే, ఈ హీరో ఖాళీగా వున్నాడు అని తెలిసినా, ఒక్క నిర్మాత కూడా అతనితో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. ఆ యాక్షన్ హీరోతో సినిమా తీస్తే వర్కవుట్ కాదు అనే అభిప్రాయం తెలుగు చిత్రసీమలో బాగా ప్రచారం అవ్వడంతో ఆ హీరోగారి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. నిజానికి గత ఏడాది ఆ హీరోతో చాలా మంది సినిమాలను ప్లాన్ చేసారు.కానీ, అంతలో కరోనా రావడంతో ఏ సినిమా కూడా ఒక్క అంగుళం కూడా ముందుకు వెళ్లలేకపోయింది.

ఈ లోపు అతని సినిమాలకు మార్కెట్ పెద్దగా లేదని బయ్యర్లు నుండి ఫీడ్ బ్యాక్ రావడం, దానికి తగ్గట్టుగానే అతని లాస్ట్ సినిమా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉండటంతో మొత్తానికి ఈ హీరోని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తున్నారు నిర్మాతలు.తన గత సినిమాతో పెద్ద హిట్ కొట్టిన ఓ మిడ్ రేంజ్ డైరక్టర్ ఈ యాక్షన్ హీరోతో ప్రస్తుతానికి సినిమా చేస్తున్నాడు గానీ, అతనికి మరో ఆప్షన్ లేక సినిమా చేస్తున్నాడనే సంగతి తెలిసి వేరే నిర్మాతలు ఇప్పుడు ఆ హీరో దగ్గరికే వెళ్లడం లేదు. అదేంటో గాని, ఆ హీరో కెరీర్ మొదటి నుండి ఇలాగే ఉంది.

హీరోగా ఫెయిల్ అయి, విలన్ గా మారి మళ్ళీ హీరోగా సక్సెస్ అయి.. చివరకు యాక్షన్ హీరో అనే క్రెడిట్ ను సాధించి.. మళ్ళీ విలన్ గా మారే పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు.అయితే ఈ హీరో పై దర్శకులకు కూడా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. కథలో ఏకంగా తలకాయనే పెట్టి కెలుకుతూ ఉంటాడని, పైగా హీరోగారి మార్కెట్ లెక్కలు కూడా ప్రస్తుతం బాగాలేదు అని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హీరోతో సినిమా చేస్తే పది కోట్లకు మించి వర్కవుట్ కాదని నిర్మాతలు కూడా బలంగా నమ్ముతున్నారు. దీనికితోడు ఈ హీరో తన రెమ్యునరేషనే ఎనిమిది కోట్లు అడుగుతున్నడట.. అందుకే నిర్మాతలు ఈ హీరోని అస్సలు పట్టించుకోవట్లేదటని తెలుస్తోంది..!!