Movie News

బాలయ్యకు ఒక కథ కావాలి..??

నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మాంచి ఫామ్ లో ఉన్నాడు.. ఈ వయసులో కూడా బాలయ్య వరుస ప్రాజెక్టు లతో దూసుకెళ్తున్నాడు.. ఇక ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య.. ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడు ఇండ్రస్టీ లో ఆసక్తిగా మారింది..ఇక గత కొంతకాలంగా బాలయ్యతో సినిమా చేయడానికి ముందుకు రాని దర్శకనిర్మాతలు ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు..

అందుకు కారణం ‘అఖండ’ సినిమానే..ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ బాలయ్యమాస్ రేంజ్అంటే ఏంటో నిరూపించింది.. ఇక ఇప్పటికే హారిక హాసిని సంస్థలో నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయాల్సివుంది. అన్నీ కుదిరితే.. అయ్యప్పయుమ్ కోషియమ్ రీమేక్‌లోనే ఆయన చేసేద్దురు. కానీ కుదర్లేదు. కానీ బాలయ్య ఇచ్చిన కాల్షీట్లు మాత్రం ఆ సంస్థ దగ్గర ఉన్నాయి.

అందుకే బాలయ్య కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో పడింది హారిక – హాసిని. అందుకోసం బడా రైటర్లతో సంప్రదింపులు జరుపుతోందని టాక్. బాలయ్య ప్రస్తుతం అఖండ తో బిజీ. ఆ తరవాత.. గోపీచంద్ మలినేని సినిమా ఉంటుంది. ఇది ఈ యేడాదే మొదలైపోతుంది. హారిక – హాసిని సినిమా 2022లో మొదలవుతుంది. అయితే ఈలోగా కథ లాక్ చేసుకోవాలన్నది హారిక హాసిని సంస్థ ఆలోచన. అయితే హారిక ముందున్న సమస్య ఒకటే.

బాలయ్యను డీల్ చేయడానికి సరైన దర్శకుడు లేడు.బడా దర్శకులంతా వాళ్ల వాళ్ల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి – రిస్క్ చేసేంత ధైర్యం హారికకు లేదు. ముందు కథ ఒకటి సెట్ చేసుకుంటే, ఆ తరవాత దర్శకుడ్ని వెదుక్కోవచ్చనేది వాళ్ల ప్లాన్‌. అందుకే..యువ రచయితలు, సీనియర్ రచయితలు, ఫామ్ లో ఉన్న రచయితలు. ఇలా అందరి దగ్గరా బాలయ్యకు సరిపడా కథ గురించి వాకబు చేస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర బాలయ్య కు సరిపడా ఒకట్రెండు కథలున్నాయి..వీటిల్లో బాలయ్యకు తగ్గట్టు ఓ కథని డెవలప్ చేస్తారేమో చూడాలి..!!

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago