టాలీవుడ్ లో సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి పరశురాం దర్శకుడు.. ఇక ఈ సినిమా తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నాడు..ఇంకా అనౌన్స్ మెంట్ మాత్రమే మిగిలిన ఈ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఉగాది రోజునే ప్రకటన వస్తుందనే ప్రచారం కూడా సాగింది.
కానీ.. అది జరగలేదు. మహేష్ ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా.. మే 31 అనౌన్స్ చేయాలని చూస్తున్నట్టు సమాచారం.అతడు, ఖలేజా వంటి చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీచేయాలని వీరిద్దరూ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ.. మూడో సినిమాకు ముహూర్తం రావడానికి పదేళ్లు పట్టింది. అదికూడా.. అనూహ్యమైన పరిస్థితుల్లో వీరి కాంబో సెట్ కావడం విచిత్రం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘సర్కారు వారి పాట’ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
అయితే.. మహేష్ కోసం త్రివిక్రమ్ ఎలాంటి కథను సిద్ధం చేస్తున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఈ విషయంలో ఇటు ఫ్యాన్స్ తోపాటు అటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తిగానే ఉన్నారు. వీరి మొదటి సినిమా ‘అతడు’.. సీరియస్ గా సాగే ఫ్యామిలీ ఫన్ డ్రామా. ‘ఖలేజా’ విషయానికి వస్తే.. కామెడీ ప్రధానంగా సాగిన యాక్షన్ మూవీ. మరి, హ్యాట్రిక్ మూవీ స్టోరీ ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరం.
ప్రస్తుతం త్రివిక్రమ్ వద్ద ఓ పాన్ ఇండియా మూవీతోపాటు.. కేజీఎఫ్ లాంటి కథ కూడా సిద్ధంగా ఉందట. ఇవి కాకుండా మరో మూడునాలుగు స్టోరీలు కూడా రెడీ ఉన్నాయట. అయితే.. వీటిలో ఏదో ఒకటి పిక్ చేసుకోవట్లేదట. మహేష్ కోసం కొత్తగా మరో స్టోరీ సిద్ధం చేసే పనిలో పడ్డాడట మాటల మాంత్రికుడు. అది అతడు మూవీ తరహాలో ఉంటుందని టాక్. మరి, ఇందులో వాస్తవం ఎంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజుల వరకు ఆగాల్సిందే…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…