ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాలుస్తోంది..రోజుకు దాదాపు 3 లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో.. సాధారణ జనమే కాదు.. సినీ జనాలుకూడా భయపడుతున్నారు. దీంతో.. చాలావరకు షూటింగులన్నీ అర్ధంతరంగా నిలిచిపోయాయి. కనీసం నెల రోజులు గడిచిపోతే తప్ప.. షూటింగులు ఎప్పుడు మొదలవుతాయి? అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.దీంతో.. జక్కన్న చెక్కుతున్న RRR విడుదల మరింత వెనక్కి వెళ్లిపోవడం ఖాయమనే చర్చ సాగుతోంది.
నిజానికి ఈ సినిమా గతేడాది సమ్మర్లో రావాల్సి ఉంది. కానీ.. కొవిడ్ లాక్ డౌన్ తో అనివార్యంగా వాయిదా పడింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ.. పలు కారణాలతో మళ్లీ వెనక్కు వెళ్లిపోయింది. దీంతో మూడోసారి డేట్ ప్రకటించాడు దర్శకుడు.2021 దసరా కానుగా బొమ్మ పడడం గ్యారంటీ అన్నారు. అక్టోబర్ 13న సినిమా రిలీజ్ చేసి తీరుతామని ప్రకటించారు.
కానీ.. అదికూడా కష్టమే అనుకుంటూ వస్తూనే ఉన్నారు. మధ్యలో హీరోయిన్ కరోనా బారిన పడడం.. చరణ్ ఆచార్యకు వెళ్లడం.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు? షోకు వెళ్లాల్సి ఉండడంతో.. దసరాకు కష్టమే అన్నది బలపడింది. దీంతో.. ఇక, సంక్రాంతికే అనే వాదన మొదలైంది.ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. సక్రాంతికి కూడా ఈ సినిమా రావట్లేదట! అవును.. సినిమా చిత్రీకరణ ఇంకా బ్యాలెన్స్ ఉంది.
అది కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు చాలా సమయం తీసుకోవాల్సి ఉంటుంది. వీఎఫ్ఎక్స్ వర్క్, డబ్బింగ్, ఎడిటింగ్ వగైరాలు కలుపుకొని కనీసం 6 నెలల సమయం పడుతుంది. అంతకన్నా ఎక్కువే పట్టినా ఆశ్చర్యం లేదు. ఇదంతా జరగాలంటే.. ముందు షూటింగ్ మొదలు కావాలి. అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవ్వరికీ తెలియదు.అందువల్ల RRR మూవీ వచ్చే సమ్మర్ కు వెళ్లిపోవడం ఖాయం అని అంటున్నారు. ఈ విషయంపై ఓ నెల రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు..మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి…!!
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…