టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఒకప్పటి మాజీ సీనియర్ హీరోయిన్లు మళ్ళీ వెండితెరపై రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే రమ్యకృష్ణ, విజయశాంతి, ఆమని వంటి సీనియర్ హీరోయిన్లు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అయితే కొందరు హీరోయిన్లు ఇప్పుడు సినిమా చేయాలంటే ముందుగా.. నేను నా ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలి, మంచి పాత్ర వస్తేనే తిరిగి నటిస్తాను మరీ ముఖ్యంగా నేను చేసే పాత్రలో ఫలానా షేడ్స్ ఉండాలి, అలాంటి క్యారెక్టర్ దొరికితే సినిమా చేస్తాను’ అంటూ అబ్బో… తెగ బిల్డప్ లు ఇస్తుంటారు.
కట్ చేస్తే.. సినిమా అఫీస్ లో నిర్మాత టేబుల్ సాక్షిగా రెండు రోజులకు ఒకసారి వచ్చి..రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను, దయచేసి మీ సినిమాల్లో నా కోసం మంచి పాత్రను డిజైన్ చేయించండి ప్లీజ్ అంటూ..ఆ నిర్మాత ఒప్పుకోవాలే గానీ, ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీగా ఉంటారు, ఇది చాలమంది సీనియర్ హీరోయిన్లు చేసేదే. పైకి మాత్రం అరె సినిమాలా ఫుల్ బిజీ అండి అంటూ సొల్లు కబ్బుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తుంటారు.
ప్రస్తుతం అలాంటి కబుర్లే చెబుతుంది మాజీ బబ్లీ బ్యూటీ మీనా. ‘నాకు నా కూతురు అంటే ప్రాణం, నా కూతురు కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. అదే నా సర్వస్వం. అందుకే నాకు ఆఫర్ వస్తే, ఆ ఆఫర్ కోసం నా కూతుర్ని కూడా వదిలి సెట్స్ పైకి రావాలి అనిపించేలా ఉండాలి నా పాత్ర. అలాంటి పాత్రలను మాత్రమే నేను చేస్తాను’ అంటూ కనిపించిన ప్రతి మేనేజర్ కి చెప్పుకుంటూ పోతుందట మీనా.మరి ఈ సీనియర్ హీరోయిన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలలో అలాంటి పాత్రలే చేస్తోందా ? డబ్బులు కోసం వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది కదా.
తల్లి వదిన పాత్రల్లో తెగ జీవించేస్తోంది కదా. ఏ.. తల్లి, వదిన పాత్రలకు మన సినిమాల్లో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మనకు తెలిసిందే కదా. క్రేజ్ పోయాక ఇలా క్రేజీ మాటలనే చెప్పుకుని కాలం నెట్టుకొస్తున్నారు ఈ సీనియర్ హీరోయిన్లు. ఇవ్వన్నీ ఓపెన్ గా చెప్పలేరు కాబట్టి, బయటకు నటిగా తృప్తి కావాలంటూ.. మంచి క్యారెక్టర్ దొరికితేనే చేస్తాను, లేకపోతే చెయ్యను అంటూ చెప్తున్నారట.. ఇప్పుడు సీనియర్ హీరోయిన్ మీనా కూడా అలాగే అంటోందట..!!
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…