రెండవ దశ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావం సినిమా రంగంపై పడటంతో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు థియేటర్లను మూసివేయాలని ఆదేశించాయి. అదేవిధంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గేవరకు సినిమా షూటింగ్ వాయిదా వేసుకొని హీరోలు మరోసారి ఇంటికే పరిమితమయ్యారు.
ఈ క్రమంలోనే హీరో నిఖిల్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉదృతి తగ్గేవరకు తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించాడు. నిఖిల్ ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తుండగా కరోనా ప్రభావం వల్ల ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు.
హీరో నిఖిల్ కి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కరోనా వైరస్ తో మృతి చెందాడు. అతని వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అదేవిధంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇకపోతే వృత్తిరీత్యానిఖిల్ భార్య పల్లవి డాక్టర్ కావడంతో ఇప్పటికే ఆమె రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. తను కూడా త్వరలోనే వ్యాక్సిన్ వేయించుకోబోతున్నానని అందరూ కూడా.. వ్యాక్సిన్ వేయించుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…