Categories: FeaturedMovie News

షాకింగ్ న్యూస్ : గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత..!!

సౌత్ సినీ ఇండస్ట్రీలో అతిపెద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది.. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు కె.వి.ఆనంద్‌(54) గుండెపోటుతో మరణించారు. దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ఆనంద్ సినీ కెరీర్ లో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. ముఖ్యంగా ఆయన సినీ ప్రస్థానం కూడా ఎంతో విభిన్నమైనది.

ఒక చిన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి..ఒక చిన్న స్టిల్ ఫోటోగ్రాఫర్ గా కెరీర్ ను మొదలుపెట్టి.. ఆ తరువాత తక్కువ టైంలోనే ‘తెన్నావిన్‌ కోంబత్‌’ అనే మలయాళీ చిత్రంతో సినిమాటోగ్రాఫర్‌ గా మారి మొదటి సక్సెస్ అందుకున్నారు.ఆ తరువాత కాలంలో ఆయన తమిళం, మలయాళంతో పాటు తెలుగులో అలాగే బాలీవుడ్‌ లో కూడా పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌ గా పని చేసి తనకంటూ మంచి డిమాండ్ ను క్రియేట్ చేసుకున్నారు.

ఆయన కెమెరామెన్‌ గా వచ్చిన ‘తెన్నావిన్‌ కోంబత్’ అనే చిత్రానికిగానూ కె.వి.ఆనంద్‌ కు ఏకంగా జాతీయ అవార్డు వరించింది అంటేనే ఆనంద్ కెమరా గొప్ప తనం గురించి అర్థమవుతుంది.ఇక ఆనంద్ సినిమా దర్శకుడిగానూ సూపర్ సక్సెస్ అయ్యారు. అయన తీసిన పలు చిత్రాలు ఇప్పటికీ క్లాసిక్ గానే నిలిచాయి. ముఖ్యంగా జీవాతో తెరకెక్కించిన రంగం(కో) సినిమాతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ భారీ హిట్ కొట్టి.. తన సినిమాల శైలి విభిన్నమైనది అని నిరూపించుకున్నారు.

దర్శకుడిగా ఆ తరువాత కూడా ఆయన బ్రదర్స్‌(మాట్రాన్‌), అనేకుడు(అనేగన్‌), కవన్‌, బందోబస్త్‌(కాప్పాన్‌) లాంటి సినిమాలు తీసి మంచి విజయాలనే అందుకున్నారు.ఇక కె.వి.ఆనంద్ మృతి పై చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో తమిళ సినీ ఇండస్ట్రీకి వరుస షాకులు మీద షాక్ లు తగులుతున్నాయి. ఆనంద్ మరణ వార్తతో తమిళ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి..ఆయన మరణం పట్ల పలువురు తమిళ, తెలుగు ఇండ్రస్టీ కి చెందిన సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ.. తమ సంతాపాలను ప్రకటిస్తున్నారు…

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago