రెండవ దశ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ ప్రభావం సినిమా రంగంపై పడటంతో ఇప్పటికే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కోలుకున్నారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు థియేటర్లను మూసివేయాలని ఆదేశించాయి. అదేవిధంగా కరోనా వైరస్ ఉద్ధృతి తగ్గేవరకు సినిమా షూటింగ్ వాయిదా వేసుకొని హీరోలు మరోసారి ఇంటికే పరిమితమయ్యారు.

ఈ క్రమంలోనే హీరో నిఖిల్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ ఉదృతి తగ్గేవరకు తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ లాక్‌డౌన్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించాడు. నిఖిల్ ప్రస్తుతం ‘18 పేజెస్’, ‘కార్తీకేయ-2’ చిత్రాలలో నటిస్తుండగా కరోనా ప్రభావం వల్ల ఆ సినిమాలు వాయిదా పడ్డాయి. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి షూటింగ్లో పాల్గొననున్నారు.

హీరో నిఖిల్ కి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కరోనా వైరస్ తో మృతి చెందాడు. అతని వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అదేవిధంగా కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఇకపోతే వృత్తిరీత్యానిఖిల్ భార్య పల్లవి డాక్టర్ కావడంతో ఇప్పటికే ఆమె రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. తను కూడా త్వరలోనే వ్యాక్సిన్ వేయించుకోబోతున్నానని అందరూ కూడా.. వ్యాక్సిన్ వేయించుకొని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here