రైతుబంధు తరహా చేనేతబంధు.. వారికి ఎంత మెుత్తం ఇస్తారో!

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేనేతకు ప్రభుత్వం అందిస్తున్న పోత్సాహాల గురించి వివరించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం, నేతన్న చేయూత, చేనేత మిత్ర లాంటి పథకాలతో పాటు చేనేత సొసైటీలకు ప్రభుత్వం కొంత మెుత్తాన్ని అందించడం, కార్మికులకు ముడి సరుకులను సబ్సిడీలు అందించడం, మగ్గాల ఆధునీకరణ వంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదని సీఎం తెలిపారు.

రైతు బందు,దళిత బంధు తరహాలో తెలంగాణలోని నేత కార్మికులకు చేనేతబంధు పథకాన్ని తీసుకొస్తామని గతంలో సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించారు. పథకం అమలుకు కసరత్తకు ప్రణాళికలు రూపోదిస్తున్నారు అధికారులు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధిపై మరింత దృష్టిపెట్టిన నేతన్నలకు చేయూతకు ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. చేనేత బంధును కూడా త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతుంది.