Featured

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలో బాలనటిగా కనిపించి అతనితో హీరోయిన్ గా నటించిందెవరో మీకు తెలుసా.?!

సూపర్ స్టార్ కృష్ణ అందాల శ్రీదేవి ఈ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. 1980 దశకంలో వచ్చిన వీరిద్దరి చిత్రాలు మంచి విజయాన్ని పొందాయి. శ్రీదేవి 1980 ప్రథమార్ధంలో తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. 1979 లో ప్రారంభమైన వీరిద్దరి సినీ ప్రయాణం అనేక విజయవంతమైన సినిమాలతో ముందుకు వెళ్ళింది. 1979 విద్యాసాగర్ నిర్మాణం మస్తాన్ రావు దర్శకత్వంలో “బుర్రిపాలెం బుల్లోడు” చిత్రం విడులైంది. ఈ సినిమాలో కృష్ణ, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే వారు కలిసి అనేక చిత్రాల్లో నటించినప్పటికీ.. ఈ సినిమానే వారి కెరీర్ కు పునాది వేసిందని చెప్పవచ్చు.

ఈ చిత్రం గమ్మత్తుగా విడుదలై వంద రోజులు ప్రదర్శింపబడింది. ముందుగా మస్తాన్రావు విద్యాసాగర్ కలిసి ఓ హిందీ చిత్రం రీమేక్ హక్కులను తీసుకుందాం అనుకున్నారు. చివరికి ఆ బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ హక్కులను ఇవ్వము అనడంతో, మస్తాన్ రావు ఒక స్టోరీ లైన్ చెప్పడంతో రచయితలు సత్యానంద్, జంధ్యాల కలిసి ఆ స్టోరీ లైన్ ని అభివృద్ధి చేశారు. ఆ కథను కృష్ణకు చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు. ఆ తర్వాత హిందీ రీమేక్ తీస్తే కృష్ణ, జయప్రదలను హీరో, హీరోయిన్లుగా సినిమా మొదలు పెడదామనుకున్నారు. కానీ జయప్రద “బుర్రిపాలెం బుల్లోడు” చిత్రం విషయం ఎటూ.. తేల్చకపోవడంతో అదే కథను శ్రీదేవికి చెప్పడంతో ఆమె ఒప్పుకున్నారు. కానీ కృష్ణ, శ్రీదేవి డేట్స్ అడ్జస్ట్ కావడం చాలా కష్టమైంది. అయినప్పటికీ చాలా ఇబ్బందులతో సినిమాను పూర్తిచేశారు. అలా విడుదలై ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది.

ఆ తర్వాత బంగారు భూమి, మహారాజశ్రీ మాయగాడు, కిరాయికోటిగాడు, వజ్రాయుధం, చుట్టాలున్నారు జాగ్రత్త వంటి విజయవంతమైన చిత్రాల్లో కృష్ణ, శ్రీదేవి కలిసి నటించారు. అయితే ఈ సినిమాల కన్నా ముందే శ్రీదేవి బాలనటిగా కృష్ణ సినిమాలో నటించడం జరిగింది. 1970 లో నందన్ రావు దర్శకత్వంలో మా “నాన్న నిర్దోషి” చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో కృష్ణ విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించారు. శ్రీదేవి ఇందులో బాలనటిగా కనిపించారు. 1970 మార్చిలో తాపీచాణక్య దర్శకత్వం లో “విధి విలాసం” అనే చిత్రం విడుదలైంది. ఇందులో కృష్ణ, విజయ నిర్మల హీరో హీరోయిన్లుగా నటించారు. వీరిద్దరికీ కూతురిగా శ్రీదేవి నటించింది. అలా శ్రీదేవి.. కృష్ణ సినిమాలలో బాలనటిగా కనిపించి ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో ఆయన ప్రక్కన హీరోయిన్ గా నటించారు. అలా నటించి శ్రీదేవి తెలుగు సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago