Colors swathi : కలర్స్ స్వాతి జీవితంలో కలర్స్ లేకుండా, సినిమాలు లేకుండా చేసిన ఆ బడా ఫ్యామిలీ హీరో… ప్రేమ అని నమ్మించి చివరికి నడిరోడ్డుపై వదిలేసాడట…!

Colors Swathi : మా టీవీ లో ప్రసారమయ్యే ‘colors (కలర్స్)’ అనే ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయి ఆ తరువాత హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వాతి ప్రస్తుతం పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. సినిమా ఇండస్ట్రీ కి దూరంగ ఉంటున్న స్వాతి గురించి ఒక న్యూస్ గత కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతోంది. స్వాతి అంటే చాలా మంది ప్రేక్షకులకు తెలియక పోవచ్చు కానీ కలర్స్ స్వాతి అంటే మాత్రం అందరికీ బాగా గుర్తొస్తుంది. ఇక డేంజర్, అష్ట చెమ్మ, కార్తికేయ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రేమ పేరుతో మోసం.. నడిరోడ్డు మీద స్వాతి కెరీర్…

కలర్స్ ప్రోగ్రామ్ చేస్తున్న సమయంలోనే ఒక బడా కుటుంబానికి చెందిన హీరో స్వాతి మీద మోజు పడ్డాడట. ఇక స్నేహం పేరుతో దగ్గరై ఆ తరువాత ప్రేమ అంటూ కలరింగ్ ఇచ్చాడు. ఇదంతా నిజమని నమ్మిన స్వాతి అతనితో ప్రేమలో పడిందట. అప్పుడే ఎంటర్ అయ్యాడు ఆ హీరో తండ్రి, ఆ బడా హీరో తండ్రి కొడుకు అదుపు తప్పుతున్నాడని ఇద్దరినీ దూరం చేసి పీక్స్ లో ఉన్న స్వాతి కెరీర్ ను నాశనం చేసేసాడు.

అవకాశాలు లేకుండా చేసి రోడ్డు మీద పడేసారట. ఇక ఈ ఇష్యూ తరువాత స్వాతి కెరీర్ డౌన్ అయిపోయి అడపాదడపా ఇతర భాషల్లో సినిమాలు చేసి ఇక బ్రేక్ తీసుకుంది. మళ్ళీ కొంత కాలానికి కొన్ని సినిమాలు చేసినా కెరీర్ గాడిన పడలేదు. ఇక పైలట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం పంచతంత్రం అనే సినిమా ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది స్వాతి.