Categories: FeaturedMovie News

Sadha : ఊరికే నో చెప్పకుండా… కొంచెం కూడా తెలివి లేకుండా అలాంటి సమాధానం చెప్పడమేంటి సదా..!

Sadha : ‘జయం’ సినిమాతో ట్రెడిషనల్ అమ్మాయిగా మంచి మార్కులు కొట్టేసిన అమ్మడు సదా. ఈ బెంగుళూరు అమ్మాయి జయం సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక వరుస ఆఫర్స్ తో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దొంగ దొంగది, నాగ, అపరిచితుడు, ఔనన్నా కాదన్నా వంటి సినిమాల్తో అలరించిన సదా ఆ తరువాత వెండి తెరకు దూరమైంది. చాలా రోజులకు ఒకటి అరా సినిమాలు తీసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇక ఈటీవీలో ఢీ షోకి జడ్జి గా కూడా కొద్ది రోజులు వచ్చిన సదా మళ్ళీ కనబడలేదు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సదా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. అయితే అవకాశం వెతుక్కుంటూ వస్తే కాదని కాలదన్నుకుంది ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీ లో ఇదే హాట్ టాపిక్.

నితిన్ తో దురుసుగా మాట్లాడిందట…

జయం సినిమా వచ్చి 25 సంవత్సరాలైంది. ఇటీవలే నితిన్ సినిమా ఇండస్ట్రీ కి వచ్చి 25 సంవత్సరాలు అయిందని తన లేటెస్ట్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ లో జయం సినిమాలో హిట్ అయిన ‘రాను రానుంటూనే చిన్నదో’ పాటను కూడా రీమిక్స్ చేసి పెట్టుకున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా పాట మాత్రం మళ్ళీ మంచి హిట్ అందుకుంది. అయితే ఈ ఐటమ్ సాంగ్ లో మొదట సదా నే అనుకున్నారట. అందుకోసం నితిన్ సదాకు స్వయంగా కాల్ చేసి మరీ అడిగితే అమ్మడు ఊరికే చేయను అనుంటే సరిపోయేది.

అలా అనకుండా నీతో హీరోయిన్ గా చేసాను, మళ్ళీ ఐటమ్ సాంగ్ నీ పక్కన ఎలా చేస్తాను నాకు విలువేముంటుంది, నువ్వు నన్ను ఎలా అడగగలవు అంటూ అనడంతో సారీ అని చెప్పి నితిన్ ఫోన్ కట్ చేసాడట. అసలే ముదురు బ్యూటీ, పెళ్లి కాకపోయినా ఆల్రడీ ఫేడవుట్ అయినా అమ్మడికి అవకాశాలు రావడం తక్కువ. ఇక ఇలా మాట్లాడితే ఇండస్ట్రీ లో అవకాశాలు ఏమొస్తాయి అంటూ కొంతమంది పెదవి విరుస్తున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago